• తాజా వార్తలు

ఈ 8 స్మార్ట్‌ఫోన్లు.. ధ‌ర త‌గ్గాయ్

కొత్త ఫోన్లు లాంచ్ చేసిన‌ప్పుడు మార్కెట్‌లో అప్ప‌టికే ఉన్న ఫోన్ల‌కు కంపెనీలు ధ‌ర తగ్గిస్తుంటాయి. పాత‌వాటిని అమ్ముకునే వ్యూహంలో ఇదో భాగం. శాంసంగ్ ఏడు ఫోన్ల‌పై ధ‌ర త‌గ్గిచింది క‌దా.  వ‌న్‌ప్ల‌స్‌, ఒప్పో, వివో, షియోమి ఇలా అన్ని కంపెనీలు ఇదే ఫాలో అవుతున్నాయి. రీసెంట్‌గా ధ‌ర త‌గ్గిన స్మార్ట్ ఫోన్ల వివ‌రాలివిగో..

 

1) వ‌న్‌ప్ల‌స్ 7టీ ప్రో (OnePlus 7T Pro)
8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన ప‌వ‌ర్ ఫుల్ ఫోన్ ఇది. ఇప్పుడు 7వేలు ధ‌ర త‌గ్గింది.
ప్రారంభ ధ‌ర‌:  రూ.54,999 
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.47,999


2) ఐక్యూ 3 (iQOO 3)
8జీబీ ర్యామ్‌, 128, 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్ల‌లో ఈ ఫోన్ రిలీజ‌యింది. ఇప్పుడు 4వేలు ధ‌ర త‌గ్గింది.
ఐక్యూ 3 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ ప్రారంభ ధ‌ర‌:  రూ.38,990
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.34,990
ఐక్యూ 3 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధ‌ర‌:  రూ.41,990
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.37,990 

3) వివో వీ 19 (Vivo V19)
4జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్ల‌లో ఈ ఫోన్ రిలీజ‌యింది. ఇప్పుడు వ‌రుస‌గా 3వేలు, 4వేలు ధ‌ర త‌గ్గింది.
వివో వీ 19 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ ప్రారంభ ధ‌ర‌:  రూ.27,990
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.24,990
వివో వీ19 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధ‌ర‌:  రూ.31,990
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.27,990 


4) ఒప్పో రెనో3 ప్రో (Oppo Reno 3 Pro )
ఈ ఫోన్‌ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్ల‌లో ఈ ఫోన్ రిలీజ‌యింది. ఇప్పుడు వ‌రుస‌గా 2వేలు, 3వేలు ధ‌ర త‌గ్గింది.
ఒప్పో రెనో3 ప్రో  128 జీబీ స్టోరేజ్‌ ప్రారంభ ధ‌ర‌:  రూ.29,990
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.27,990
ఒప్పో రెనో 3 ప్రో 256 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధ‌ర‌:  రూ.32,990
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.29,990 


5) రెడ్‌మీ కే 20 ప్రో (Redmi K20 Pro)
స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో రిలీజ‌యిన ఈ ప‌వ‌ర్‌ఫుల్ ఫోన్ ధ‌ర‌ను షియోమి ఇప్పుడు రెండు వేలు త‌గ్గించింది.  
ప్రారంభ ధ‌ర‌:  రూ.24,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.22,999


6) రియ‌ల్‌మీ 6ఐ  (​ Realme 6)
4,3000 ఎంఏహెచ్‌తో మంచి బ్యాట‌రీ సామ‌ర్థ్యం, 30 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ కెపాసిటీతో వ‌చ్చిన ఈ ఫోన్‌పై ఇప్పుడు వెయ్యి రూపాయ‌ల ధ‌‌ర త‌గ్గింది.
 ప్రారంభ ధ‌ర‌:  రూ. 14,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.13,999


7) రియ‌ల్‌మీ 6 (​ Realme 6)
ఇందులో మూడు వేరియంట్లున్నాయి. అన్నింటిపైనా వెయ్యి రూపాయ‌ల ధ‌‌ర త‌గ్గింది.
రియ‌ల్‌మీ 6  4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ ప్రారంభ‌ ధ‌ర‌:  రూ. 14,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.13,999
రియ‌ల్‌మీ 6  6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ ప్రారంభ‌ ధ‌ర‌:  రూ. 15,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.14,999
రియ‌ల్‌మీ 6  6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ ప్రారంభ‌ ధ‌ర‌:  రూ. 16,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.15,999


8)వివో ఎస్‌1 ప్రో (Vivo S1 Pro)
స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్‌, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌చ్చిన ఈ ఫోన్ మీద వివో వెయ్యి రూపాయ‌ల ధ‌ర త‌గ్గించింది. 
వివో ఎస్‌1 ప్రో ప్రారంభ‌ ధ‌ర‌:  రూ. 20,990
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.19,990