• తాజా వార్తలు

రీసెంట్‌గా ధ‌ర త‌గ్గిన 7 శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల వివ‌రాలు ఇవిగో ..

మార్కెట్‌లోకి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. దీంతో పాత‌వాటిపై కంపెనీలు ధ‌ర‌లు త‌గ్గిస్తున్నాయి. కొరియా కంపెనీ శాంసంగ్ త‌న స్మార్ట్‌ఫోన్ల‌లో చాలా మోడ‌ల్స్‌పై రీసెంట్‌గా ధ‌ర త‌గ్గించింది. వాటి వివ‌రాలివిగో..


1) శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ( Samsung Galaxy Z Flip)
కొరియా కంపెనీ శాంసంగ్ హైఎండ్ ఫీచ‌ర్ల‌తో తీసుకొచ్చిన ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఫిబ్ర‌వ‌రిలో దీన్ని లాంచ్ చేసిన‌ప్పుడు దీని ధ‌ర ఎంతుందో దానికంటే ఇప్పుడు 7వేలు త‌గ్గించింది.
ప్రారంభ ధ‌ర‌:  రూ.1,15,999  
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.1,08,999


2)శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్‌ (​Samsung Galaxy Galaxy Note 10 Lite ) 
శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో వ‌చ్చిన హైఎండ్ ఫోన్ల‌లో ఇది ఒక‌టి .  ఇందులో6 జీబీ, 8జీబీ రెండు ర్యామ్ వేరింయ‌ట్లున్నాయి. రెండింటిపైనా  1000 రూపాయ‌లు ధ‌ర  తగ్గించింది. 
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ 6జీబీ ర్యామ్ ప్రారంభ ధ‌ర‌:  రూ. 38,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ37,999 

 

3)శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ (Samsung Galaxy A50s) 
రెండు వేరియంట్ల‌లో రిలీజ‌యింది. 6వేల రూపాయ‌లు ధ‌ర త‌గ్గింది. 
శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ 4జీ ర్యామ్ ప్రారంభ ధ‌ర‌:  రూ.24,599  
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.18,599
శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ 6జీ ర్యామ్ ప్రారంభ ధ‌ర‌:  రూ.26,561  
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.20,561


4)శాంసంగ్ గెలాక్సీ ఏ71 (​Samsung Galaxy A71) 
శాంసంగ్ త‌న గెలాక్సీ సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది మొద‌ట్లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు రెండువేలు ధ‌ర త‌గ్గింది. 
ప్రారంభ ధ‌ర‌:  రూ.32,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.30,999 

 

5) శాంసంగ్ గెలాక్సీ ఏ51 (​Samsung Galaxy A51) 
శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో బాగా క్లిక్క‌యిన ఫోన్ ఇది. ఇందులో6 జీబీ ర్యామ్ వేరింయ‌బ‌ట్‌పై రూ.1215 తగ్గించింది. 8జీబీ ర్యామ్ ఫోన్‌పై రెండు వేలు ధ‌ర త‌గ్గింది. 
శాంసంగ్ గెలాక్సీ ఏ51 6జీబీ ర్యామ్ ప్రారంభ ధ‌ర‌:  రూ. 25,214
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.23,999 
శాంసంగ్ గెలాక్సీ ఏ51 8జీబీ ర్యామ్ ప్రారంభ ధ‌ర‌:  రూ. 27,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.25,999 

 

6) శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్‌ (​Samsung Galaxy A21s) 
శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో వ‌చ్చిన మ‌రో ఫోన్ ఇది.  ఇందులో6 జీబీ ర్యామ్ వేరింయ‌బ‌ట్‌పై రూ.1500 తగ్గించింది. 8జీబీ ర్యామ్ ఫోన్‌పై రెండు వేలు ధ‌ర త‌గ్గింది. 
శాంసంగ్ గెలాక్సీ ఏ21 ఎస్‌ 6జీబీ ర్యామ్ ప్రారంభ ధ‌ర‌:  రూ. 16,499
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.14,999 
శాంసంగ్ గెలాక్సీ ఏ21 ఎస్ 8జీబీ ర్యామ్ ప్రారంభ ధ‌ర‌:  రూ.18,499
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.16,499 

 

7) శాంసంగ్ గెలాక్సీ ఏ31 (​Samsung Galaxy A31) 
శాంసంగ్ త‌న గెలాక్సీ సిరీస్‌లో భాగంగా ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో రిలీజ్ చేసిన ఈ ఫోన్ మీద‌ ఇప్పుడు వెయ్యి రూపాయ‌ల ధ‌ర త‌గ్గింది. 
ప్రారంభ ధ‌ర‌:  రూ.21,999
ధ‌ర త‌గ్గించాక‌:  రూ.20,999