• తాజా వార్తలు
  •  

విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి హైద‌రాబాద్‌లో శాంసంగ్ డిజిట‌ల్ అకాడ‌మీ

విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైద‌రాబాద్ టెక్నాల‌జీలో ముంద‌డుగు వేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో టెక్ కంపెనీలు ఇక్క‌డ త‌మ క్యాంప‌స్‌లు ప్రారంభించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు నిర్వ‌హించాయి. త‌మ కంపెనీలు వేగంగా ఎదిగేందుకు ఇక్క‌డ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండ‌డంతో టెక్ దిగ్గ‌జాలు ఒక్కొక్క‌టిగా హైద‌రాబాద్‌కు వ‌స్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్ ఇలా వ‌చ్చిన‌వే. తాజాగా విద్యార్థుల‌కు టైజెన్ ఇతర ప్రోగ్రామ్స్‌లో శిక్ష‌ణ ఇవ్వ‌డానికి భాగ్య‌న‌గరంలో శాంసంగ్ కంపెనీ డిజిట‌ల్ అకాడ‌నీని ఏర్పాటు చేసింది.

టైజెన్ ఓఎస్ ల‌క్ష్యంగా
తెలుగు స్టేట్స్‌లో ముఖ్యంగా తెలంగాణ‌లో సాంకేతిక విద్య పురోగ‌తి ఎక్కువ‌గా ఉన్నందున ఇక్క‌డ విద్యార్థుల‌కు కొత్త ఓఎస్‌, ఇత‌ర టెక్నిక‌ల్ స్కిల్స్‌లో శిక్ష‌ణ ఇవ్వాల‌ని శాంసంగ్ కంపెనీ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో టైజెన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో పాటు అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాసెస్‌ల‌ను విద్యార్థుల‌కు నేర్పించ‌డానికి శాంసంగ్ డిజిట‌ల్ అకాడ‌మీని ఏర్పాటు చేసింది. త్వ‌ర‌లోనే భార‌త్‌లో టెక్నిక‌ల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తామ‌ని గ‌తంలో శాంసంగ్ ప్ర‌క‌ట‌న చేసింది. తాజాగా హైద‌రాబాద్‌లో ఆ ప్ర‌క‌ట‌న‌ను అమ‌లు చేసింది. రాబోయే కాలంలో టైజెన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అన్ని ఉప‌క‌ర‌ణాల‌లో ఉప‌యోగించే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా యువత‌కు ఈ కోర్సు నేర్పిస్తున్న‌ట్లు శాంసంగ్ తెలిపింది.

అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం
బిగిన‌ర్స్ కోసం సుల‌భంగా అప్లికేష‌న్స్‌ను ఎలా డెవల‌ప్ చేయాల‌నే విష‌యంపై ఈ అకాడ‌మీలో నేర్పించ‌నున్నారు. టైజెన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కాకుండా అప్లికేష‌న్ డెవ‌లెప్‌మెంట్ ప్రాసెస్‌, టెస్టింగ్ మ‌రియు డిబ‌గ్గింగ్‌, డివైజ్ అప్లికేష‌న్ ప్రొగ్రామ్ ఇంట‌ర్‌ఫేస్‌, పాకేజింగ్‌, ఇన్‌స్టాలేష‌న్‌, డిజైన్డ్ అప్లికేష‌న్ లాంటి భిన్న‌మైన కోర్సుల‌ను ఈ అకాడ‌మీలో నేర్పించ‌నున్నారు. దీని వ‌ల్ల విద్యార్థులు రాబోయే కాలంలో సుల‌భంగా ఉద్యోగాలు సంపాదించ‌డం కోసం ఈ శిక్షణ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని శాంసంగ్ తెలిపింది. శాంసంగ్ ఇండియా, తెలంగాణ అకాడ‌మీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మ‌ధ్య ఒప్పందంలో భాగంగా ఈ అకాడ‌మీ ఏర్పాటైంది.

ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల్లో కూడా..
శాంసంగ్ కేవ‌లం ఈ అకాడ‌మీతో ఆగిపోవ‌ట్లేదు. తెలంగాణ‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో కూడా త‌మ టెక్ సేవ‌ల్ని విస్త‌రించాల‌నే ఆలోచ‌న‌లో ఉంది. ముందుగా తెలంగాణ‌లో పూర్తి స్థాయిలో కొత్త అప్లికేష‌న్ల శిక్షణ ఇవ్వాల‌నే ల‌క్ష్యంగా పెట్ట‌కుంది. దీనిలో భాగంగా తెలంగాణ‌లోని ఇంజ‌నీరింగ్ క‌ళాశాలల్లో కూడా త‌మ టెక్నిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్‌ల‌తో ఫాక‌ల్టీ ఓరియంటేష‌న్ ప్రోగ్రామ్‌ల‌ను నిర్వ‌హించాల‌ని శాంసంగ్ నిర్ణ‌యించింది. ఈ స్మార్ట్ డివైజ్ యుగంలో ఈ కోర్సులు కంప్లీట్ చేసిన యువ‌త‌కు మంచి ఉద్యోగ అవ‌కాశాలు ఉంటాయ‌ని ఈ ప్రాజెక్ట్ అధికారులు వెల్ల‌డించారు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు