• తాజా వార్తలు

ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో ప్రైవ‌సీ కోసం ఫేస్ రిక‌గ్నైజేష‌న్‌‌, ఫింగ‌ర్‌ప్రింట్ లాక్‌!!

ఫేస్‌బుక్ వాడుతున్న‌వాళ్లంద‌రికీ దాదాపు మెసెంజ‌ర్ గురించి కూడా తెలుసు. మ‌న ఎఫ్‌బీ ఫ్రెండ్స్‌కు ప్రైవేట్ మెసేజ్ ఇవ్వాలంటే ఆటోమేటిగ్గా మెసెంజ‌ర్ వాడుతుంటాం. అయితే ఇది కూడా ఫేస్‌బుక్‌లా యాప్‌.  దాదాపు మ‌న సోష‌ల్ మీడియా యాప్‌ల‌న్నీ అన్‌లాక్ చేసే ఉంటాయి. ఎందుకంటే మ‌నం వాటిని త‌ర‌చుగా వాడుతుంటాం కాబ‌ట్టి చాలామంది వాటికి లాక్ పెట్టుకోరు. ఇలాంట‌ప్పుడు మీ ఫోన్ దొరికితే చాలు  మీ ఎఫ్‌బీ మెసెంజ‌ర్‌లోని ప్రైవేట్ మెసేజ్‌లను ఎవ‌రైనా చూసే అవ‌కాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌కు మ‌రింత ప్రొటెక్ష‌న్ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.  

ఫింగ‌ర్‌ప్రింట్‌, ఫేస్ రిక‌గ్నైజేష‌న్‌
మెసెంజ‌ర్‌కు పాస్‌వ‌ర్డ్‌తో పాటు ఫింగ‌ర్ ప్రింట్ లాక్‌ను ఎఫ్‌బీ తీసుకురాబోతోంది. అలాగే ఫేస్ రిక‌గ్నైజేష‌న్ ఫీచ‌ర్‌ను కూడా అందుబాటులోకి తేనుంది.  ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే మీ ఫోన్ అన్‌లాక్  చేసి ఉన్నా కూడా ఎఫ్‌బీ మెసెంజ‌ర్‌లో మీ మెసేజ్‌లు చూడాలంటే ఎవ‌రికీ సాధ్య‌మవదు. ఎందుకంటే దీనికి మీ ఫింగ‌ర్ ప్రింట్ లేదా ఫేస్ రిక‌గ్నైజేష‌న్‌తో లాక్ పెట్టుకుంటారు.  యూజ‌ర్ల ప్రైవ‌సీ కోసం దీన్ని త్వ‌ర‌లోనే తీసుకురాబోతున్న‌ట్లు ఫేస్‌బుక్ ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. 

ఐవోఎస్‌లో టెస్టింగ్‌
ప్ర‌స్తుతానికి ఐవోఎస్ డివైస్‌ల్లో ఈ ఫీచ‌ర్‌ను ఫేస్‌బుక్ టెస్ట్ చేస్తోంద‌ని, అది క్లిక్క‌యితే ఆండ్రాయిడ్‌లోనూ ప‌రీక్షించి రిలీజ్ చేస్తుంద‌ని టెక్నాల‌జీ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. ఫేస్‌బుక్ దీనిపై క్లారిటీ ఇవ్వాలి మ‌రి. 

జన రంజకమైన వార్తలు