• తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో ఒక ఫ్రెండ్ ని మ‌రో ఫ్రెండ్‌కి తెలియ‌కుండా హైడ్ చేయ‌డం ఎలా?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియో సైట్ల‌లో ఫేస్‌బుక్ ఒక‌టి.  అయితే మ‌నం ఎంత‌కాలం నుంచి ఫేస్‌బుక్ యూజ్ చేస్తున్నా దానిలో ఉండే ఫీచ‌ర్లు చాలా త‌క్కువ మందికే తెలుసు. పోస్టులు చేయ‌డం లేదా పోస్టులు చూడ‌డం లేదా ఇంకా స్టోరీస్ చూడ‌డం, చాట్ చేయ‌డం వ‌ర‌కే మ‌న‌కు తెలిసింది. అయితే ప్రైవ‌సీ విష‌యానికి వ‌స్తే ఎఫ్‌బీ మ‌న‌కు  చాలా ఆప్ష‌న్లు ఇచ్చింది. వాటిలో హైడ్ కూడా ఒక‌టి. దీని ద్వారా ఒక స్నేహితుడికి తెలియ‌కుండా మ‌రొక‌రిని దాచొచ్చు. అదెలాగో చూద్దాం..

ప్రైవ‌సీ కోసం..

ఫేస్‌బుక్‌లో మీ స్నేహితుల జాబితా చాలా పెద్ద‌దిగా ఉండొచ్చు.  అందులో మీకు మ్యుచువ‌ల్ ఫ్రెండ్స్ ఉంటారు. కొన్ని అన్ నౌట్ రిక్వ‌స్ట్‌లుగా కూడా అనుకోకుండా యాక్సెప్ట్ చేస్తారు. అయితే మ‌న‌కు అంద‌రి యాక్టివిటీ అవ‌స‌రం లేదు.. మన‌కు తెలియ‌ని వాళ్ల గురించి తెలుసుకోన‌వ‌స‌రం లేదనుకుంటే అలాంటి వారిని మ‌నం దాచేయ‌చ్చు. అంతేకాదు ఒక స్నేహితుడిని మ‌రొక‌రికి క‌నిపించ‌కుండా దాయ‌చ్చు.

ఇలా చేయండి..
1. ఫేస్‌బుక్ లాగిన్ లోకి వెళ్లి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. మీ ప్రొఫైల్ పేజీ ఓపెన్ చేయాలి. మీరు పేరు మీద క్లిక్ చేయ‌డం ద్వారా ఈ ప్రొఫైల్ పేజీలోకి వెళ్లొచ్చు. 

2. ఆ త‌ర్వాత ఫ్రెండ్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి మీ స్నేహితుల జాబితాలోకి వెళ్లాలి

3. ఈ ఫ్రెండ్స్ పేజీలో పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత ఎడిట్ ప్రైవ‌సీ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాలి. 

4. డ్రా డౌన్ యారో మీద  క్లిక్ చేసి హూ కెన్ సీ మై ఫ్రెండ్స్ లిస్ట్ అని ఆప్ష‌న్ మీద క్లిక్ చేసి అందులో వోన్లీ మీ మీద క్లిక్ చేయాలి.

ఇలా చేయ‌డం ద్వారా మీ స్నేహితుల జాబితా ఎవ‌రికీ క‌నిపించ‌దు. 

జన రంజకమైన వార్తలు