• తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో న్యూస్ సెక్ష‌న్‌... మ‌నం తప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు

యూజ‌ర్ల ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ఫేస్‌బుక్ చాలా అప్‌డేట్స్ చేస్తూ ఉంటుంది. వీటిలో చాలా ఆప్ష‌న్ల‌ను మ‌నం ప‌ట్టించుకోం.. ఎక్కువ‌గా ఉప‌యోగించం.. కానీ కొన్ని ఆప్ష‌న్లు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. అలాంటి ఆప్ష‌నే ఫేస్‌బుక్ న్యూస్‌.. మ‌రి ఏంటి ఫేస్‌బుక్ న్యూస్‌.. దీనిలో మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యాలు ఏమిటి?

డెడికేటెడ్ ప్లేస్ ఫ‌ర్ న్యూస్‌
డెడికేటెడ్ ప్లేస్ ఫ‌ర్ న్యూస్ పేరిట ఫేస్‌బుక్ కొత్త‌గా మొద‌లుపెట్టిన ఫీచ‌రే ఈ న్యూస్.. దీన్ని ప్ర‌స్తుతం సెల‌క్టెడ్  ఏరియాల్లోనే టెస్టు చేస్తున్నారు. యుఎస్‌లో దీన్ని ప్ర‌స్తుతం టెస్టు చేస్తున్నారు. న్యూస్ ఐట‌మ్స్ మీద స్టోరీల మీద మ‌రింత కంట్రోల్ కోస‌మే ఎఫ్‌బీ ఈ కొత్త ఫీచ‌ర్‌ని తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ తెచ్చిన ఈ కొత్త న్యూస్ ఫీచ‌ర్‌లో ప‌ర్స‌న‌లైజేష‌న్ ఫీచ‌ర్ ఉంది. టుడేస్ స్టోరీస్‌, ఓల్డ్ స్టోరీస్ లాంటి ఆప్ష‌న్లు ఉన్నాయి. అంటే యూజ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు న్యూస్ తెలుసుకోవ‌చ్చు. మిషీన్ లెర్నింగ్‌కు ప‌రిమితులు ఉండ‌డంతో ఒరిజిన‌ల్ కంటెంట్ కోసం స్థానిక జ‌ర్న‌లిస్టుల సాయం తీసుకుంటోంది ఫేస్‌బుక్‌.

న్యూస్ అంతా ఒక తాటిపై
న్యూస్ అంత‌టిని ఒక తాటిపై తీసుకు రావ‌డానికి గూగుల్ న్యూస్ సెక్ష‌న్ ద్వారా ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని ర‌కాల న్యూస్‌లు త‌మ న్యూస్ సెక్ష‌న్‌లో ఉండేలా ఫేస్‌బుక్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. అంతేకాకుండా ఫేక్ న్యూస్ కాకుండా జ‌న్యున్ న్యూస్ ఇవ్వ‌డం కోసం ఎఫ్‌బీ ప్ర‌యత్నిస్తోంది. ఏదైనా ఫేక్ న్యూస్ వ‌చ్చినా అల‌ర్ట్ చేస్తోంది. దీని వ‌ల్ల యూజ‌ర్ల‌కు కూడా ఎఫ్‌బీ మీద మ‌రింత విశ్వాసం పెరుగుతుంద‌ని ఆ సంస్థ భావిస్తోంది. 

జన రంజకమైన వార్తలు