• తాజా వార్తలు

ఇక ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లోనూ మెసేజ్ ఫార్వ‌ర్డ్ ఐదుగురికే

ఫేస్‌బుక్ పేరు లేకుండా ప‌త్రిక‌లు రిలీజ‌వ‌డం లేదు. టీవీల్లో వార్త‌లుండ‌టం లేదు.  ఫేస్‌బుక్ త‌ను పెట్టుకున్న రూల్స్‌ను త‌నే అతిక్ర‌మిస్తోంద‌ని, కొన్ని పార్టీల లీడ‌ర్ల విద్వేష  ప్ర‌సంగాల‌ను మాత్రం ఫ్రీగా వ‌దిలేసి, కొంద‌రిని మాత్రం కావాల‌ని టార్గెట్ చేస్తోంద‌ని దీనిమీద ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌. 2014 ఎన్నిక‌ల నుంచి ఇండియాలో బీజేపీకి ఫేస్‌బుక్ స‌పోర్ట్ చేస్తోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు విప‌రీత‌మైన ఆరోప‌ణలు చేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌లో విప‌రీత‌మైన త‌ప్పుడు స‌మాచారం స్ప్రెడ్ అవుతోంద‌ని, క‌రోనా టైమ్‌లో ఇది మ‌రింత పెరిగింద‌ని విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఎల‌క్ష‌న్ల‌లోనూ ఎఫ్‌బీ నెగిటివ్‌గా వెళుతుంద‌ని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వీటన్నింటి నుంచి త‌ప్పుకోవ‌డానికి ఫేస్‌బుక్ ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. 

మెసెంజ‌ర్ నుంచి ఫార్వ‌ర్డ్‌పై లిమిటేష‌న్స్‌
ఇకపై ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ నుంచి మెసేజ్ ఫార్వ‌ర్డ్ చేసేట‌ప్పుడు లిమిటేష‌న్స్ పెట్టారు. అంటే ఒక‌సారి ఐదుగురు వ్య‌క్తులు లేదా గ్రూప్‌ల‌కు మాత్ర‌మే దీన్ని ఫార్వ‌ర్డ్ చేయ‌గ‌లుగుతాం. త‌ప్పుడు స‌మాచారం ఏదైనా ఉంటే క్ష‌ణాల్లో అంద‌రికీ పాకిపోకుండా కంట్రోల్ చేయ‌డానికి దీన్ని తీసుకొచ్చిన‌ట్లు ఫేస్‌బుక్ ప్రక‌టించింది.  

వాట్సాప్‌లో కూడా
వాట్సాప్‌ను గ‌తేడాది కొనేసిన ఫేస్‌బుక్ దానిలో కూడా మెసేజ్ ఫార్వ‌ర్డ్‌ను ఐదుగురికే ప‌రిమితం చేసిన సంగతి గుర్తుందిగా.. ఇప్పుడు అదే రూల్‌ను మెసెంజ‌ర్‌లో కూడా ఫాలో అవుతోంది. 

జన రంజకమైన వార్తలు