• తాజా వార్తలు

ప‌ర్సులో ఇమిడిపోయే లైట్ ఫోన్

స్మార్ట్‌ఫోన్ అన‌గానే ఇప్పుడు జేబు చాల‌ట్లేదు. ఏ కంపెనీకి ఆ కంపెనీ సైజులు పెంచుకుంటూపోవ‌డంతో ఫోన్ల సైజులు బాగా పెరిగిపోయాయి.  ఒక‌ప్పుడు బేసిక్ ఫోన్ల‌ను జేబులో వేసుకుని వెళ్లిపోయేవాళ్లు. అవి జేబులో ఉన్నా కూడా తెలిసేవి కావు. అంత సైజు, బ‌రువు త‌క్కువ‌గా ఉండేవి ఆ ఫోన్లు. కానీ ఇప్పుడు వ‌స్తున్న స్మార్టుఫోన్ల‌ను మాత్రం జేబులో పెట్టుకోవ‌డం చాలా క‌ష్టం. కానీ అంత ఖ‌రీదైన‌వి ఎక్క‌డ పెట్టినా దానిపై ఒక క‌న్ను వేయాల్సిందే.  అయితే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా  ఒక కొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది.  దాని పేరు లైట్ ఫోన్! దీని పేరుకు త‌గ్గ‌ట్టే ఇది చాలా లైట్‌. ఎంత లైట్ అంటే మీరు ప‌ర్సులో పెట్టుకుని ఎక్క‌డికైనా తీసుకొళ్లొచ్చు. 

ప్ర‌పంచంలోనే చిన్న‌ది
కిక్ స్టార్ట‌ర్ జెల్లీ ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభం అవుతున్న ఈ ఫోన్ ప్ర‌పంచంలోనే చిన్న ఫోన్‌గా త‌యారు కాబోతోంది. ఆండ్రాయిడ్ నౌగ‌ట్ టెక్నాల‌జీతో రూపొందుతున్న ఈ ఫోన్ ప్ర‌పంచంలోనే చిన్న‌దైనా 4జీ ఫోన్‌గా నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డు సైజులో త‌యారు అవుతున్న ఈ ఫోన్‌లో వీలైన‌న్ని ఆప్ష‌న్లు పెట్టేందుకు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. వీలైనంత చిన్న‌ది, స‌న్న‌దిగా దీన్ని త‌యారు చేస్తున్నారు. మీ ఫోన్ ప్లాన్‌కు త‌గ్గ‌ట్టే ఈ లైట్ ఫోన్ ప‌ని చేస్తుంది. అయితే ఈ లైట్‌ఫోన్‌లో ఉప‌యోగిస్తున్న సాఫ్ట్‌వేర్ ఫ్లాట్‌ఫాం ద్వారా ఫోన్లు చేయ‌డం, రిసీవ్ చేసుకోవ‌డం చేయ‌చ్చు. దీని కోసం ప్ర‌త్యేక‌మై సిమ్ కార్డులు కూడా త‌యారు అయ్యాయి. 

ఫీచ‌ర్లు ప‌రిమిత‌మే
ఈ బుల్లి ఫోన్‌లో ఫీచ‌ర్లు ప‌రిమితంగానే ఉండ‌నున్నాయి. ఫోన్ కాల్స్ చేయ‌డం క‌న్నా రిసీవ్ చేసుకోవ‌డం దీని ద్వారా సాధ్యం అవుతుంది. స్పీడ్ డ‌య‌ల్‌లో తొమ్మిది ఫోన్ నంబ‌ర్ల వ‌ర‌కు స్టోర్ చేసుకునే అవ‌కాశం ఉంది. దీనిలో మెసేజ్‌లు పంప‌డం, ఈమెయిల్స్ పంప‌డం లాంటి ఆప్ష‌న్లు లేవు. దీనిలో నానో సిమ్ కార్డు స్లాట్ ఉంది. ఇది 2జీ జీఎస్ఎం నెట్‌వ‌ర్క్స్‌ను స‌పోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కూడా మూడు రోజులు వ‌స్తుంది. స్పీక‌ర్‌, చిన్నదైన ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ప‌వ‌ర్ కీ, మైక్రో యూఎస్‌బీ పోర్ట్, కీ పాడ్ దీనిలో ఇత‌ర ఫీచ‌ర్లు. ఈ లైట్ ఫోన్ ప్ర‌త్యేక‌త ఏంటంటే క్రెడిట్ కార్డు మాదిరిగా మ‌న వాలెట్‌లో దీన్ని పెట్టుకోవ‌చ్చు. దీని ధ‌ర రూ.9640గా ఉంది.