• తాజా వార్తలు

జంబో బ్యాట‌రీతో షియోమి ఎంఐ మ్యాక్స్ 2 వ‌చ్చేసింది..

మొబైల్ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్న‌ట్లుగానే షియోమి ఎంఐ మ్యాక్స్ 2 ..సూప‌ర్ గ్రాండ్ ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయింది. భారీ బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఎక్స్‌ట్రా లార్జ్ స్క్రీన్ డిస్ ప్లేతో మ్యాక్స్ 2ను తీసుకొస్తున్న‌ట్లు షియోమి గురువారం చైనాలో జరిగిన ఈవెంట్‌లో చెప్పింది. 5,3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ముందు నుంచే చెబుతున్న‌ట్లుగానే ఎంఐ మ్యాక్స్ 2 ఫాబ్లెట్ 6.44 ఇంచెస్ భారీ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. రౌండెడ్ ఎడ్జెస్ ప్యాన‌ల్ ఫోన్ ప‌ట్టుకున్న‌ప్పుడు బెట‌ర్ ఫీల్ ఇస్తాయి. ఐఫోన్ 7లో మాదిరిగా యాంటెన్నా లైన్స్ ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద ఎసెట్ 5,300 ఎంఏహెచ్ జంబో బ్యాట‌రీ. ఈ బ్యాట‌రీతో ఈ ఫాబ్లెట్ రెండు రోజులు ప‌ని చేస్తుంద‌ని ఎంఐ ప్ర‌క‌టించింది. అంతేకాదు ఈ భారీ బ్యాట‌రీని ఛార్జ్ చేసుకునేందుకు గంట‌లు గంట‌లు వెయిట్ చేసే ప‌నికూడా లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీతో ఉండ‌డంతో కేవ‌లం గంట‌లోనే 68% ఛార్జింగ్ అవుతుంది. ఆ వివ‌రాలు తెలియాలి ముందు చెప్పిన‌ట్లుగానే గురువారం.. షియోమి ఎంఐ మ్యాక్స్ ఫాబ్లెట్ డిటెయిల్స్ చెప్పింది. అయితే ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుంది. ఇండియాలో ఎప్ప‌టి నుంచి దొరుకుతుందో ఇంకా తెలియ‌లేదు. ప్రైస్ కూడా ఇంకా తెలియాల్సి ఉంది.