• తాజా వార్తలు

ఫ్లిప్ కార్ట్ “లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్ “ స్కీమ్ నీ నమ్మొచ్చా లేక మరో జిమ్మిక్కా ?

ఆన్‌లైన్‌లో వ‌స్తువులు కొనుగోలు చేస్తే మ‌న‌కు న‌చ్చ‌క‌పోతేనో లేక సైజులు స‌రిగ్గా లేక‌పోతేనో వెన‌క్కి ఇవ్వ‌డం మామూలే. అయితే ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల విష‌యంలో మాత్రం ఇ-కామ‌ర్స్ సైట్లు క‌ఠిన నిబంధ‌న‌లు అనుస‌రిస్తాయి. చాలా త‌క్కువ రిటర్న్ స‌మ‌యాన్ని ఇస్తాయి లేదా కాన్సిల్ అవ‌కాశాన్ని అస్స‌లూ ఇవ్వ‌వు. అయితే ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిఫ్ కార్ట్ తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన ఓ ప్రొగ్రామ్ ఆస‌క్తిని రేపుతోంది. దీని ప్ర‌కారం ఆన్‌లైన్‌లో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి ఆ త‌ర్వాత ఒక 15 రోజులు వాడుకుని తిరిగి ఇచ్చేయ‌చ్చ‌ట‌. అంతేకాదు ఫుల్ రిఫండ్ కూడా ఆ సంస్థ ఇచ్చేస్తుంద‌ట‌.

 శాంసంగ్ ఫోన్ల‌తో మొద‌లు

ఫ్లిఫ్ కార్ట్ తాజాగా ప్ర‌వేవ‌పెట్టిన కార్య‌క్ర‌మాన్ని ఆ సంస్థ శాంసంగ్ ఫోన్ల ద్వారా ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించ‌బోతోంది.  శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిఫ్ 3 లాంటి ఫోన్ల కు ఫ్లిఫ్ కార్ట్ ఈ ఆఫ‌ర్‌ను వ‌ర్తింప‌జేస్తోంది . అంటే ఈ ఫోన్ల‌ను కొన్న త‌ర్వాత 15 రోజులు వాడుకుని మ‌న‌కు న‌చ్చ‌కపోతే ఒరిజిన‌ల్ ట్యాగ్‌ల‌తో వీటిని తిరిగి పంపేయ‌చ్చు. మ‌న‌కు వెంట‌నే ఫుల్ రిఫండ్ కూడా వ‌స్తుంది. ఈ కొత్త కార్య‌క్ర‌మం వ‌ల్ల బ్రాండ్ న్యూ ఫోన్ల‌ను ఉప‌యోగించుని ప‌రిశీలించి వాటిని న‌చ్చ‌క‌పోతే తిరిగి ఇచ్చే అవ‌కాశం క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌భించ‌నుంది. అయితే క్వాలిటీ చెక్ చేసుకున్న త‌ర్వాత మాత్ర‌మే ఈ రిట‌ర్న్‌ను అంగీక‌రిస్తారు. ఏమైనా డ్యామేజ్ అయినా లేదా వ‌ర్కింగ్ కండీష‌న్‌లో ఏదైనా తేడా ఉన్నా రిట‌ర్న్ తిర‌స్క‌రిస్తార‌న్నసంగ‌తిని గుర్తుంచుకోవాలి.

 ఆ ప‌ట్ట‌ణాల్లో మాత్ర‌మే

ఫ్లిప్ కార్ట్ ప్ర‌వేశ‌పెట్టిన ల‌వ్ ఇట్ ఆర్ రిట‌ర్న్ ఇట్ ప్రొగ్రామ్ కొన్ని ప‌ట్ట‌ణాల‌కే ప‌రిమితం కానుంది. ఇది ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ప్రొగ్రామ్ కాబ‌ట్టి ఆరంభంలో లిమిటెడ్ సిటీల‌కే ఈ ఆఫ‌ర్ ఉంటుంద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది.  తొలి జాబితాలో హైద‌రాబాద్‌, పుణె, దిల్లీ, ముంబ‌యి, గుర్‌గ్రామ్‌, అహ్మ‌దాబాద్‌, కోల్‌క‌తా, చెన్నై, వ‌దోద‌ర లాంటి న‌గ‌రాలు ఉన్నాయి. ఈ ఆఫ‌ర్ వ‌ల్ల ల‌గ్జ‌రీ స్మార్ట్‌ఫోన్ల‌ను కొనుగోలు చేయ‌డానికి క‌స్ట‌మ‌ర్లు అమితాశ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఫ్లిప్ కార్టు వెల్ల‌డించింది.  ఈ ఫోన్ల‌ను 15 రోజులు వాడుకున్న త‌ర్వాత రిట‌ర్న్ చేయ‌చ్చ‌ని దీనికి ఫ్లిఫ్ కార్టులో ఒక వెబ్ లింక్ ఉంటుంద‌ని.. దాన్ని క్లిక్ చేసి రిట‌ర్న్ ఆప్ష‌న్ క్లిక్  చేయాల‌ని.... ఆ త‌ర్వాత  ఐఎంఐఈ నంబ‌ర్ క్లిక్ చేయాల‌ని ఆపై రిఫండ్ ప్రొసీడ్ అవుతుంద‌ని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
 

జన రంజకమైన వార్తలు