• తాజా వార్తలు

ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ట్విట‌ర్‌ను మామూలుగా స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఉప‌యోగించేవాళ్లు త‌క్కువైపోతున్నారు. ఎందుకంటే ఎన్నో అంశాల‌కు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ వేదిక‌గా మారిపోతోంది. అందులో ప్ర‌ధాన‌మైంది స్పేసెస్‌. ఇటీవ‌ల ట్విట‌ర్‌లో వ‌చ్చిన ఓ విప్ల‌వం లాంటిది ఈ ఫీచ‌ర్‌. ఎందుకంటే దీని ద్వారా చ‌ర్చ‌లు పెట్టుకునే అవ‌కాశం క‌లుగుతుంది. ఎన్నో విష‌యాల‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. అయితే ట్విట‌ర్ స్పేసుల్లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ఫీచ‌ర్లు ఉన్నాయి. మ‌రి టాప్ ఫీచ‌ర్లేంటో తెలుసుకుందామా!

 క‌న్వ‌ర్సేష‌న్ల‌ను రికార్డు చేయ‌చ్చు

ట్విట‌ర్‌లో స్పేస్ పెట్టిన‌ప్పుడు మ‌న‌కు ఆ త‌ర్వాత  ఎలా జ‌రిగిందో తెలుసుకోవ‌డానికి ఒక ఆప్ష‌న్ ఉంది. అదే రికార్డ్ క‌న్వ‌ర్షేష‌న్‌. స్పేస్ మొద‌ల‌యిన తర్వాత నిర్వాహ‌కులు ఈ ఆప్ష‌న్ వాడితే చాలు. ఆటోమెటిక్‌గా సంభాష‌ణ‌లు అన్ని రికార్డు అవుతాయి. ఆ త‌ర్వాత ఆ రికార్డును మీరు ఇత‌రుల‌కు కూడా షేర్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఆరంభంలో ఈ ఫీచ‌ర్ ఐవోఎస్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మెల్లిమెల్లిగా కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు కూడా వ‌చ్చింది. త్వ‌ర‌లో అంద‌రికి ఈ ఆప్ష‌న్ వాడుకునే అవ‌కాశం ఉంటుంది.

అకౌంట్ లేకుండా స్పేస్ విన‌డం

మ‌న‌కు ట్విట‌ర్ అకౌంట్ ఉంటేనే స్పేస్ వాడ‌గ‌లం అనుకుంటాం. కానీ ఎలాంటి అకౌంట్ లేకుండా కూడా స్పేస్‌లో జ‌రిగే సంభాష‌ణ‌ల‌ను వినే అవ‌కాశం ఉంద‌ని మీకు తెలుసా!  వెబ్ ఎలిమినేటింగ్ ఆప్ష‌న్ ద్వారా స్పేస్‌లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. ట్విట‌ర్ అకౌంట్ లేని వారికి ఈ కొత్త ఫీచ‌ర్ ఉప‌యుక్తంగా ఉంటుంది.

 స్పేస్ నిర్వ‌హ‌ణ‌, ట్విట్ కంపోజ‌ర్‌

ప్ర‌తి ఒక్క యూజ‌ర్‌కు స్సేస్‌ను నిర్వ‌హించే అవ‌కాశాన్ని ట్విట‌ర్ క‌ల్పిస్తోంది . ఆరంభంలో ఇది క‌నీసం 600 మంది  ఫాలోవ‌ర్లు ఉన్న‌వారికి మాత్ర‌మే నిర్వ‌హించే ఉండేది.  లైవ్ స్పేస్ నుంచి నేరుగా ట్విట్ చేసే అవ‌కాశాన్ని అప్ డేటెడ్ ట్విట్ కాంపోజ‌ర్ క‌ల్పిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐవోస్ యూజ‌ర్లు నేరుగా ఈ ఆప్ష‌న్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇందుకోసం న్యూ కంపోజ‌ర్ ఐకాన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు స్పేసెస్ ఆడియోతో పాటు స్సేస్ హ్యాష్ ట్యాగ్ కూడా వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు