• తాజా వార్తలు

స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

బెంగళూరులోని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్, గ్రీన్‌ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో, నగర ఆస్పత్రుల వెలుపల బెడ్ పొందడానికి తీవ్రంగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఉచిత ఆక్సిజన్ అందించే ఐదు అధునాతన బస్సులను ప్రారంభించింది,  కోవిడ్ కల్లోలంలో రోగుల ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్ ను అందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఏ సమయంలోనైనా 12 మంది రోగులకు వసతి కల్పించేలా ప్రతి బస్సును పున: రూపకల్పన చేశారు.ఈ బస్సులో 12 మందికి సీటుతో పాటుగా ఆక్సిజన్ సదుపాయం కూడా ఉంటుంది. 

పద్మనాభనగర్‌లోని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడంతో, గ్రీన్వుడ్ హై ఇంటెల్ స్కూల్ ఈ అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులకు కొంత విశ్రాంతినిచ్చేలా చేసింది. ఉచిత ఆక్సిజన్ సదుపాయాన్ని పొందడానికి ప్రతి రోగి తన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదా ఆర్టిపిసిఆర్ రిపోర్ట్, వారి ఆధార్ కార్డు యొక్క కాపీని అందించాల్సి ఉంటుంది.

 "రాబోయే పది రోజులు ఇది ఎలా సాగుతుందో చూడాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ప్లాన్ విజయవంతం అయితే ఆ తరువాత మరో 10 బస్సుల వరకు స్కేల్ చేస్తాము" అని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సతీష్ కుమార్ జైన్ చెప్పారు. ప్రతి పేషెంట్ ఈ బస్సు ద్వారా 2 గంటలు ఆక్సిజన్‌ను ఉపయోగించగలుగుతారు.  ఆక్సిజన్ ప్రవాహాన్ని ఫ్లో మీటర్ మరియు రెగ్యులేటర్‌తో అనుసంధానించడానికి free nasal canula కూడా ఇవ్వబడుతుంది.

జన రంజకమైన వార్తలు