• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ 12 ఫీచర్లను ముందే టెస్ట్ చేయాలా ? అయితే ఇవిగో యాప్స్

ఆండ్రాయిడ్ 12లో ఉన్న ఫీచ‌ర్ల కోసం ఉప‌యోగ‌ప‌డే యాప్‌లివే

గూగుల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కొత్త వెర్ష‌న్ ఆండ్రాయిడ్ 12. ఇప్పుడు దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ల‌కు ఈ కొత్త వెర్ష‌న్ కంపాటబుల్‌గా ఉంది. ప్రైవ‌సీ అప్‌డేట్స్ తో పాటు మంచి డిజైన్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. పిక్స‌ల్ ఫోన్ల‌లో మాత్ర‌మే ఉన్న కొన్ని ఫీచ‌ర్లు మిగిలిన స్మార్ట్‌ఫోన్ల‌లోనూ మ‌నం పొందొచ్చు. అయితే ఈ ఫీచ‌ర్ల‌ను పొందేందుకు ఒక నాలుగు యాప్స్ చేస్తాయి. అవేంటో చూద్దాం..

ప్రైవ‌సీ డాష్‌బోర్డ్‌

ఆండ్రాయిడ్ 12లో కీల‌క‌మైన ఫీచ‌ర్ల‌లో ప్రైవ‌సీ డాష్‌బోర్డ్ ఒక‌టి. ఈ ఫీచ‌ర్‌ను ప్రైవ‌సీ డాష్ బోర్డ్ యాప్ ద్వారా ఉపయోగించుకోవ‌చ్చు. మ‌నం ఈ యాప్‌లోకి వెళితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో మిగిలిన యాప్‌లు సెన్సిటివ్ స‌మాచారాన్ని ఎలా ఎక్సెస్ చేస్తున్నాయో తెలుస్తుంది. అంతేకాదు క‌స్ట‌మ‌ర్ల‌కు ఆయా యాప్‌ల‌కు సెన్సిటివ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను లిమిట్ చేయ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

స్మార్ట్ ఆటో రొటేట్‌

ఆండ్రాయిడ్  12లో  ఆటో రొటేట్ సిస్టిమ్‌ను మ‌రింత మెరుగ్గా తీసుకొచ్చారు. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా యూజ‌ర్ త‌ల ఎటు వైపు ఫేస్ చేసి ఉంది ఎన్ని సార్లు క‌దులుతుంది అనే విష‌యాన్ని కూడా క‌నిపెట్ట‌గ‌ల‌దు. దానికి త‌గ్గ‌ట్టుగా ఇది కెమెరా ఆప‌రేష‌న్‌ను స‌ర్దుబాటు చేసుకుంటుంది. ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్ పిక్స‌ల్ ఫోన్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది.  ఇది స్మార్ట్ ఆటో రొటేట్ యాప్ ద్వారా యూజ్ చేసుకోవ‌చ్చు.

స్మార్ట్ సెర్చ్‌

ఆండ్రాయిడ్ 12లో ప్ర‌ధాన స్క్రీన్‌లో ఉన్న సెర్చ్‌బార్ స్మార్ట్ సెర్చ్ కోసం ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఇది కేవ‌లం ఫోన్‌లో మాత్ర‌మే కాదు వెబ్‌లో సెర్చ్ చేసి బెట‌ర్ రిజ‌ల్ట్స్ అందిస్తుంది. సిసెమె యాప్ వేయ‌డం ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో కూడా  మ‌నం ఇలాంటి ఫీచర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. యాప్ వేశాక దాన్ని ప్ర‌ధాన స్క్రీన్‌లో ఉన్న విడ్జెట్స్‌లో పెట్టుకోవాలి.

ప్రైవ‌సీ ఇండికేట‌ర్స్‌

యాపిల్ మాదిరిగానే ఆండ్రాయిడ్  12 లో ప్రైవ‌సీ ఫీచ‌ర్ ఉంది. దీన్ని ప్రైవ‌సీ ఇండికేట‌ర్స్ అంటారు.  ఏదైనా అప్లికేష‌న్ ద్వారా కెమెరా లేదా మైక్రోఫోన్‌, లొకేష‌న్ ఉప‌యోగించిన‌ప్పుడు ఒక పాప‌ప్ వ‌స్తుంది. ప్రైవ‌సీ డాష్‌బోర్డ్ యాప్ ఉప‌యోగించి కూడా ఈ ఆప్ష‌న్ ఉప‌యోగించుకోవ‌చ్చు.
 

జన రంజకమైన వార్తలు