• తాజా వార్తలు

ఐపీఎల్ ల‌వ‌ర్స్ కోసం జియో క్రికెట్ ప్లాన్స్ .. డిటెయిల్డ్‌గా మీకోసం..

ఐపీఎల్ సీజ‌న్ మ‌రో మూడు రోజుల్లో మొద‌ల‌వుతుంది. ఫోర్లు, సిక్స్లులు, వికెట్లు, ఫ్రీహిట్లు, ర‌నౌట్లు ఒక‌టేమిటి ప్ర‌తి బంతీ వినోద‌మే. ఆ వినోదాన్ని క్ష‌ణం కూడా మిస్స‌వ‌కుండా ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో  కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాల్సిందే. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా చూడొచ్చు.  అందుకే ఐపీఎల్ ల‌వ‌ర్స్ కోసం రిల‌య‌న్స్ జియో అందిస్తోంది జియో క్రికెట్ ప్లాన్స్.  401 రూపాయ‌ల‌ నుంచి ఈ ప్లాన్స్‌ మొదలవుతాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

జియో రూ.401 క్రికెట్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ:  28 రోజులు
* రోజూ 3జీబీ డేటా చొప్పున 28 రోజులకు 84 జీబీ డేటా. అదనంగా మరో 6జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 జీబీ
* అన్‌లిమిటెడ్ కాల్స్  
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు  
* రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.  
* జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

 
జియో రూ. 499 క్రికెట్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ:  56 రోజులు
* రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 56 రోజులకు  84 జీబీ డేటా
* అన్‌లిమిటెడ్ కాల్స్  
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు  
* రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.  
* జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

 
జియో రూ. 598 క్రికెట్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ:  56 రోజులు
* రోజూ 2జీబీ డేటా చొప్పున 56 రోజులకు 112 జీబీ డేటా
* అన్‌లిమిటెడ్ కాల్స్  
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు  
* రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.  
* జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.


జియో రూ. 777 క్రికెట్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ:  84 రోజులు
* రోజూ 1.5జీబీ డేటా చొప్పున 84 రోజులకు 126 జీబీ డేటా . అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది
* అన్‌లిమిటెడ్ కాల్స్  
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు  
* రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.  
* జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

జియో రూ. 2599 క్రికెట్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ:  365 రోజులు
* రోజూ 2 జీబీ డేటా చొప్పున  365 రోజులకు 730 జీబీ డేటా . అదనంగా మరో 10 జీబీ మొత్తం 740 డేటా లభిస్తుంది
* అన్‌లిమిటెడ్ కాల్స్  
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు  
* రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.  
* జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
 అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది


జియో క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్స్‌
వ్యాలిడిటీ ఉండి డేటా అయిపోయిన‌వారు, డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ కావాల‌నుకునేవారి కోసం జియో క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్స్ కూడా తీసుకొచ్చింది. వీట‌న్నింటిలో రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

* జియో రూ.612 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 72 జీబీ డేటా లభిస్తుంది.  

* జియో రూ.1004 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 120 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 200జీబీ డేటా వాడుకోవచ్చు.

* జియో రూ.1206 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 180 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 240జీబీ డేటా లభిస్తుంది.

* జియో రూ.1208 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 240 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 240జీబీ డేటా లభిస్తుంది.  

 

జన రంజకమైన వార్తలు