• తాజా వార్తలు

11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

కొవిడ్ నేప‌థ్యంలో పెద్ద‌ల‌కు వ‌ర్క్ ఫ్రం హోం, పిల్ల‌ల‌కు  ఆన్‌లైన్ క్లాస్‌లు న‌డుస్తున్నాయి. దీంతో మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగింది. ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఇచ్చిన డేటా అయిపోయి అద‌న‌పు డేటా కోరుకునేవారి కోసం జియో 11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అలాగే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్ఎన్ఎల్ కూడా డేటా బూస్ట‌ర్ ప్యాక్‌లు తీసుకొచ్చాయి. 

జియో
ఇంత‌కు ముందు 11 రూపాయ‌ల రీఛార్జితో జియో 400 ఎంబీ డేటా ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 1జీబీకి పెంచింది.  అలాగే  21 రూపాయ‌ల డేటా యాడ్ ఆన్ ప్యాక్‌తో 2జీబీ డేటా, 51 రూపాయ‌ల డేటా యాడ్ ఆన్ ప్యాక్‌తో 6జీబీ డేటా ఇస్తుంది. 101 రూపాయ‌ల యాడ్ ఆన్ ప్యాక్‌తో 12జీబీ డేటా ఇస్తుంది. వీటిని  మీ ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ ఉన్నంత వ‌ర‌కు ఎప్పుడైనా  వాడుకోవ‌చ్చు.  
* 151 రూపాయ‌ల వ‌ర్క్ ఫ్రం హోం డేటా ప్యాక్ తీసుకుంటే అద‌నంగా 30 జీబీ డేటా వ‌స్తుంది. 40జీబీ కావాలంటే 201 రూపాయ‌ల‌తో, 50 జీబీ కావాలంటే 251 రూపాయ‌ల‌తో రీచార్జి చేసుకోవాలి. వీటి వ్యాలిడిటీ నెల రోజులు.  

ఎయిర్‌టెల్ 
ఎయిర్‌టెల్ 78 రూపాయ‌ల డేటా ప్యాక్‌తో 5జీబీ డేటా ఇస్తుంది. ఇది మీ రీఛార్జి ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత వ‌ర‌కు ఎప్పుడైనా వాడుక‌వోచ్చు. ఆ త‌ర్వాత 1 ఎంబీ డేటాకు 50 పైస‌లు ఛార్జి చేస్తుంది. ఈ 78 రూపాయ‌ల ప్యాక్‌తో వింక్ వ‌న్ మంత్ ఫ్రీ.  48 రూపాయ‌ల డేటా ప్యాక్తో 3జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో వ‌స్తుంది.  98 రోజుల‌తో రీఛార్జి చేస్తే 12 జీబీ డేటా మీ రీఛార్జి ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత వ‌ర‌కు వాడుకోవ‌చ్చు.  248 ప్లాన్‌తో 25 జీబీ డేటా, వింక్ ప్రీమియం స‌బ్ స్క్రిప్ష‌న్ ల‌బిస్తాయి.  251 రూపాల‌య డేటా ప్లాన్‌తో 50 జీబీ డేటా ఇస్తుంది. ఈ రెండు ప్లాన్లూ మీ రీచార్జి ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత‌వ‌ర‌కు వ‌స్తాయి.  

వొడాఫోన్ ఐడియా
వొడాఫోన్ ఐడియా 16 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తుంది. అయితే దీని వ్యాలిడిటీ 24 గంట‌లు మాత్ర‌మే.  49 ప్రీపెయిడ్ ప్యాక్‌తో 3జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో ఇస్తుంది. 98రోజుల ప్యాక్‌లో 12జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటితో ఇస్తుంది.  251 రూపాయ‌ల‌తో 50 జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో ఉంది. 351 రూపాయ‌ల ప్యాక్‌తో 100 జీబీ డేటా, 56 రోజుల వ్యాలిడిటీతో వ‌స్తుంది. 355 రూపాయ‌ల ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌తో 50 జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో వ‌స్తుంది. 1 సంవత్స‌రం జీ5 ప్రీమియం స‌బ్ స్క్రిప్ష‌న్ ఫ్రీ.

జన రంజకమైన వార్తలు