• తాజా వార్తలు

జియో యూజ‌ర్ల‌కు వాట్సాప్‌ ద్వారా క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం.. ఎలా పొందాలంటే..

రిలయన్స్‌ జియో సిమ్ వాడుతున్నారా?  అయితే మీకు ఓ గుడ్‌న్యూస్‌. క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం కోసం మీరు వాళ్ల‌నూ వీళ్ల‌నూ అడ‌గ‌క్క‌ర్లేదు. మీ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ అయిన జియో చాట్‌బాట్ ద్వారా ఈ స‌మాచారాన్ని మీకు అందిస్తుంది. దీంతో పాటు రీఛార్జ్‌, పేమెంట్లు వంటి ఇతర కస్టమర్‌ సర్వీసులను కూడా ఈ చాట్‌బాట్‌ ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.  

ఎలా వాడాలి?
* జియో యూజ‌ర్లు..  జియో కేర్‌ నంబర్‌ను 70007 70007ను వాట్సాప్‌లో సేవ్‌ చేసుకోవాలి. 
* త‌ర్వాత దానికి Hi అని మెసేజ్‌ పంపాలి. 
* దీంతో జియో కేర్ చాట్‌బాట్‌ సేవలు మీరు అందుకోగ‌లుగుతారు. 
* ఇప్పుడు మీకు స‌ర్వీసెస్ మెనూ క‌నిపిస్తుంది.
* అందులో కొవిడ్ వ్యాక్సిన్ ఇన్ఫ‌ర్మేష‌న్‌, జియో సిమ్ రీఛార్జి, పోర్ట‌బిలిటీ మొద‌లైన ఆప్ష‌న్లు ఉంటాయి. 
* మ‌నం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ స‌ర్వీస్‌కు సంబంధించిన వివ‌రాల‌ను చాట్‌బాట్ అందిస్తుంది. 
* మీకు క‌రోనా వ్యాక్సిన్ స‌మాచారం కావాలంటే మీ పిన్‌కోడ్‌ ఎంటర్ చేయండి. 
* ఇప్పుడు మీ స‌మీపంలోని టీకా కేంద్రాల సమాచారం వస్తుంది.
* ఏ సెంట‌ర్‌లో ఏ వ్యాక్సిన్ ఉంది, ఎన్ని డోసులు అందుబాటులో ఉంది, ఏ వ‌య‌సు వారికి వేస్తార‌నే స‌మాచారం మొత్తం చూపిస్తుంది.

జన రంజకమైన వార్తలు