• తాజా వార్తలు

వాట్సాప్ వెబ్‌లో మెసేజ్‌ల‌ను బ్ల‌ర్ చేయ‌డానికి సింపుల్ ట్రిక్‌

వాట్సాప్ మొబైల్ యాప్ వాడితే ఎండ్ టు ఎండ్ ప్రైవ‌సీ ఉంటుంది. అదే వాట్సాప్ వెబ్ వాడితే ఈజీగా ఎవ‌రయినా చూడొచ్చు. ముఖ్యంగా ఆఫీస్ పీసీల్లో వాట్సాప్ వెబ్ వాడుతున్న‌ప్పుడు మీ చాట్స్ కాంటాక్ట్స్‌, మెసేజ్‌లు, ఫోటోలు ఎవ‌రైనా చూసే అవ‌కాశం ఉంటుంది. అలా జ‌ర‌గ‌కుండా వాటిని బ్ల‌ర్ చేసేందుకు ఓ సింపుల్ ట్రిక్ ఉంది.

ఎలా?
Privacy Extension అనే క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ ద్వారా మీ వాట్సాప్ వెబ్‌ను బ్ల‌ర్ చేసుకోవ‌చ్చు. క్రోమ్‌తోపాటు క్రోమ్ ఆధారంగా ప‌ని చేసే బ్రౌజ‌ర్లు, ఫైర్‌ఫాక్స్ బ్రౌజ‌ర్ల‌కు కూడా ఈ ఎక్స్‌టెన్ష‌న్ ప‌ని చేస్తుంది.

ఏమేమి బ్ల‌ర్ చేయొచ్చు?
* మీ చాట్స్‌లోని అన్ని మెసేజ్‌లు
* మీడియా ప్రివ్యూ, గ్యాల‌రీ
* లాస్ట్ మెసేజ్ ప్రివ్యూ
* టైప్ చేస్తున్న‌ప్పుడు టెక్స్ట్ ప్రివ్యూ
* యూజ‌ర్ల ప్రొఫైల్ పిక్చ‌ర్స్‌, గ్రూప్ ఐకాన్ లేదా డీపీలు
* యూజ‌ర్లు లేదా గ్రూప్‌ల పేర్లు

ఎలా వాడుకోవాలి?
* Privacy Extensionను ఇన్‌స్టాల్ చేసుకోవాలి

* ఇప్పుడు వాట్సాప్ వెబ్‌ను ఫ్రెష్‌గా ఓపెన్ చేయండి.

* వాట్సాప్ వెబ్‌లో ఏ మెసేజ్‌ల‌ను మీరు బ్ల‌ర్ చేయాల‌నుకుంటున్నారో దానిమీద‌కు మీ మౌస్ క‌ర్స‌ర్‌ను మూవ్ చేయండి.

* ఇప్పుడు ఓ లిస్ట్ డిస్‌ప్లే అవుతుంది. మొత్తం అన్నికాంటాక్ట్స్ బ్ల‌ర్ చేయాల‌నుకుంట‌న్నారో, అన్ని మెసేజ్‌లు, ఫోటోలు ఇలా ఏది బ్ల‌ర్ చేయాల‌నుకుంటున్నారో టూగుల్ చేయండి.

* అంతే అవ‌న్నీ  బ్ల‌ర్ అయిపోతాయి. 

* బ్ల‌ర్ రిమూవ్ చేయాల‌నుకుంటే టూగుల్ ఆఫ్ చేస్తే చాలు. మ‌ళ్లీ మామూలుగా వ‌చ్చేస్తుంది.

 

జన రంజకమైన వార్తలు