• తాజా వార్తలు

రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

ఈ రోజే రంజాన్‌. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్ల‌కు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్‌డౌన్తో వెళ్ల‌లేని ప‌రిస్థితి. అయితే టెక్నాల‌జీ ఇలాంటి అసంతృప్తుల‌న్నీ చిటికెలో తీర్చేస్తుంది. జ‌స్ట్ మీ ఫ్రెండ్‌కు క‌స్ట‌మైజ్డ్ రంజాన్ శుభాకాంక్ష‌ల‌ను వాట్సాప్‌లోపంపండి. వాళ్లూ మీరూ క‌లిసి ఉన్న ఫోటోలుంటే ఇంకా సూప‌ర్‌. వాటితో మీ సొంత రంజాన్ స్టిక్క‌ర్లు ఎలా  చేయాలో చూడండి. 

మీ సొంత రంజాన్ శుభాకాంక్ష‌ల స్టిక్క‌ర్లు త‌యారుచేయడం ఎలా? 
ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ వాడుతున్న యూజ‌ర్లు  Sticker maker for WhatsAppను డౌన్‌లోడ్ చేసుకోండి. 

 * ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని Create a new sticker pack ఆప్ష‌న్ క్లిక్ చేయండి.

* క‌స్ట‌మ్ స్టిక్క‌ర్ ప్యాక్‌కి  ఒక పేరు పెట్టండి. 

*  ఇప్పుడు  add sticker అనే ఐకాన్ మీద క్లిక్ చేయండి. 

* మీ ఫోన్ గ్యాల‌రీలోకి వెళ్లి మీది,మీ ఫ్రెండ్‌ది లేదా మీకు న‌చ్చిన ఫోటో క్లిక్ చేయండి. అందులో అన‌వ‌స‌ర‌మైన పార్ట్ ఉంటే క్రాప్ చేసేయండి.   

* క్లిక్ చేయ‌గానే ఇది మీ స్టిక్క‌ర్ ప్యాక్‌కు యాడ్ అవుతుంది. ఇలా మీరు 30 ర‌కాల స్టిక్క‌ర్లు యాడ్ చేసుకోవ‌చ్చు. 

*  Publish Sticker Pack ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి. అంతే మీరు త‌యారుచేసిన స్టిక్క‌ర్ ప్యాక్ మీ వాట్సాప్ అకౌంట్‌కు యాడ్ అవుతుంది. 

* దాన్ని మీ ముస్లిం మిత్రుల‌కు పంపేయండి.

* దెబ్బ‌కు వాళ్లు ఫిదా.. లాక్డౌన్ ఎత్తేయ‌గానే ద‌మ్ బిర్యానీతో మీకు దావ‌త్ ప‌క్కా

జన రంజకమైన వార్తలు