• తాజా వార్తలు

మీరెక్క‌డున్నా మీ బుజ్జాయిని లైవ్‌లో మానిట‌ర్ చేసి చూపించే బిబినో యాప్‌

భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ ప‌నిచేసేవారికి పిల్ల‌ల‌ను చూసుకోవ‌డం చాలా ఇబ్బంది.   ఇంట్లో పెద్ద‌వాళ్లో లేదా ప‌నిమ‌నుషులో ఉన్నా బిడ్డ ఏం చేస్తోందోన‌ని త‌ల్లికి ఉండ‌టం స‌హ‌జం. దీనికి ప‌రిష్కారంగా ఓ మొబైల్ యాప్ ఉంది. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీరెక్క‌డున్నా ఇంట్లో మీ బుబ్జాయి ఏం చేస్తుందో, తింటుందో, ప‌డుకుందో, ఆడుకుంటుందో క‌నిపెట్టుకుని ఉండొచ్చు. 

బిబినో యాప్‌తో 
బిబినో (‌Bibino) పేరుతో ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల‌కు ఒక యాప్ అందుబాటులో ఉంది. దాన్ని మీరు రెండు స్మార్ట్‌ఫోన్ల‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే ఒక‌టి బేబీ ఉన్న ద‌గ్గ‌ర పెట్టి మ‌రో మొబైల్‌లో మీరు ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేసుకోవ‌చ్చు. 

ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే
* రెండు స్మార్ట్‌ఫోన్ల‌లోనూ బిబినో యాప్ డౌన్‌లోడ్ చేయండి.

* మీ కెమెరా, స్టోరేజ్‌, వీడియో, వాయిస్ యాప్‌ల‌కు ప‌ర్మిష‌న్ అడుగుతుంది. ఇవ్వండి.

* బేబీ ద‌గ్గ‌ర ఉంచే స్మార్ట్‌ఫోన్‌ను బేబీ స్టేష‌న్ అనొచ్చు. పేరెంట్ ద‌గ్గ‌ర ఉండే ఫోన్ పేరెంట్ స్టేష‌న్ అన్న‌మాట‌.

* బేబీ స్టేష‌న్‌ను బేబీ ఉన్న రూమ్‌లో పెట్టేయండి.

 * ఇప్పుడు ఈ రెండు ఫోన్ల‌నూ పెయిర్ చేయండి.

* ఇక మీరు ఎక్క‌డికి వెళ్లినా బేబీ స్టేష‌న్‌లో మీ బేబీని మానిట‌ర్ చేయొచ్చు.

జోల‌పాట పాడొచ్చు
* బిడ్డ‌తో మాట్లాడాల‌నిపిస్తే మీరు వాయిస్ మెసేజ్ పంపొచ్చు.  లేదంటే లైవ్‌లో నేరుగా మాట్లాడొచ్చు.
* జోల‌పాట పాడి బిడ్డ‌ను నిద్ర‌పుచ్చొచ్చు. ఏడుస్తుంటే స‌ముదాయించ‌వ‌చ్చు.

జన రంజకమైన వార్తలు