• తాజా వార్తలు

మీ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌ను చిటికె వేసినంత ఈజీగా తొల‌గించ‌డానికి ఇవిగో ట్రిక్స్

ఓ మంచి ఫోటో తీసుకున్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆరేసిన బ‌ట్ట‌లో,  చెప్పులో ఏవో క‌న‌ప‌డ‌తాయి. కొన్నిసార్లు మ‌నం ఇష్ట‌ప‌డి తీసుకున్న  ఫోటోలోకి ఎవ‌రో తెలియ‌ని వ్య‌క్తులు ప‌డ‌తారు. అలాంట‌ప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ క్లియ‌ర్ చేసుకుని మీకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవ‌చ్చు. అది కూడా జ‌స్ట్ చిటికేసినంత ఈజీగా. ఇందుకోసం పీసీ, మ్యాక్‌ల్లో అయితే బ్రౌజ‌ర్‌లో వాటి వెబ్‌సైట్‌లోకి వెళ్లి చేసుకోవ‌చ్చు. లేదంటే ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ యాప్స్ కూడా ఉన్నాయి.

రిమూవ్ బీజీ (remove.bg)
1. పీసీ, లేదా మ్యాక్‌లో దీన్ని వాడుకోవాలంటే బ్రౌజ‌ర్‌లో remove.bg ‌ని టైప్ చేయండి.  సైట్ ఓపెన్ చేయండి.
2. అప్‌లోడ్ ఇమేజ్‌ను క్లిక్ చేసి మీరు బ్యాక‌గ్రౌండ్ రిమూవ్ చేయాల‌నుకున్న ఫోటోను సెలెక్ట్ చేయండి.  లేదా ఆ ఇమేజ్‌ను జ‌స్ట్ డ్రాగ్ చేయండి.
3. కొన్ని సెక‌న్ల త‌ర్వాత ఆ ఫోటోల‌ని బ్యాక్‌గ్రౌండ్ క్లియ‌ర్ అయిపోతుంది. 
4. బ్యాక్‌గ్రౌండ్ స‌రిగా క‌ట్ట‌వ్వ‌లేద‌ని మీకు అనిపిస్తే ఎడిట్‌లోకి వెళ్లి ఎరేజ్‌/  రీస్టోర్ ఆప్ష‌న్ క్లిక్ చేసి ఎడ్జ‌స్ట్‌మెంట్స్ చేసుకోవ‌చ్చు.  
5. డౌన్‌లోడ్ ఆప్ష‌న్ క్లిక్ చేసి మీ ఇమేజ్‌ను ఎక్క‌డ సేవ్ చేయాల‌నుకుంటే అక్క‌డ సేవ్ చేసుకోండి. 
6.  డిఫాల్ట్‌గా కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. వీటిలో మీకు కావాల్సిన‌దాన్ని సెలెక్ట్ చేసుకుని మీ ఫోటోకు బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ చేసుకోవ‌చ్చు. 
రిమూవ్ బీజీ ఆండ్రాయిడ్ యాప్‌గా కూడా అందుబాటులో ఉంది. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సేమ్ ఇదే ప‌ద్ధ‌తిలో  మీ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు