• తాజా వార్తలు
  •  

ఇండియాలో ఇంటెల్ చిప్ రీసెర్చ్ సెంట‌ర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా దిగ్గ‌జ ఎలక్ట్రానిక్స్ కంపెనీల‌న్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇప్ప‌టికే యాపిల్ వంటి ప్ర‌ముఖ కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టాయి. తాజాగా ఎల‌క్ట్రానిక్ చిప్ త‌యారీ రంగంలో అగ్ర‌గామి కంపెనీ ఇంటెల్ ఇండియాలో మ‌రో కొత్త ప్లాంట్ పెట్ట‌బోతోంది. 1,100 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో బెంగుళూరులో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని కంపెనీ ఈ రోజు ఎనౌన్స్ చేసింది.
8 ఎక‌రాల ప్రాంగణంలో ఈ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్, హార్డ్‌వేర్ డిజైన్ స‌ర్వీస్ ఫెసిలిటీస్ కూడా ఈ సెంట‌ర్‌లో ఉంటాయి. భారత్ లో తమ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయ‌డంలో భాగంగా ఈ ఆర్ అండ్ డీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఇంటెల్ ప్ర‌క‌టించింది.
3వేల జాబ్‌లు
ఇండియాలో ఇప్ప‌టి వ‌రకు ఇంటెల్ 2 బిలియ‌న్ డాల‌ర్స్ (దాదాపు ల‌క్షా ఇర‌వై వేల కోట్ల రూపాయ‌లు) పెట్టుబ‌డులు పెట్టింది. ఆర్ అండ్‌డీ, హార్డ్ వేర్ డిజైన్, టెస్టింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ వాలిడేష‌న్‌,నెక్స్ట్ జ‌న‌రేష‌న్ డిజిట‌ల్ డివైజ‌స్ కోసం సాఫ్ట్‌వేర్ ప్రొడ‌క్ష‌న్ మీద ఎక్కువ‌గా దృష్టి పెడుతోంది.
ఇంటెల్ ఇండియ‌న్ స‌బ్సిడ‌రీలో ఇప్‌ుటికే 7వేల మందికి టెక్ ఉద్యోగాలు క‌ల్పించింది. కొత్త‌గా ఏర్పాటు చేయ‌బోయే ఆర్ అండ్ డీ సెంట‌ర్లో మ‌రో 3వేల మందికి జాబ్‌లు వ‌స్తాయ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.