• తాజా వార్తలు

వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే వ్యూహం అన్నీ క‌లిసి  వ‌న్‌ప్ల‌స్‌ను కూడా తొలిసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా మార్కెట్లోకి వ‌చ్చిందే వ‌న్ ప్ల‌స్ నార్డ్‌. పాతిక‌వేల రూపాయ‌ల నుంచే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో అన్నీ హైఎండ్ ఫీచ‌ర్లు ఉన్నాయి.  ఆగ‌స్టు 4 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి. అమెజాన్, వన్‌ప్లస్.ఇన్ ద్వారా భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 

5జీ ఫోన్‌
వ‌న్ ప్ల‌స్ నార్డ్‌.. 5జీ కనెక్టివిటీ ఫోన్‌. పంచ్ హోల్‌ డిస్‌ప్లే డిజైన్. వెనుక‌వైపు నాలుగు కెమ‌రాల‌తో హైఎండ్ ఫోన్‌కు ఉండాల్సిన ల‌క్ష‌|ణాల‌న్నీ ఉన్నాయి.  వన్‌ప్లస్ మొదటి రోజు నుండి నార్డ్‌ను ఓపెన్ సేల్‌లో దొరుకుతుంది.  

వన్‌ప్లస్ నార్డ్  ఫీచర్లు
* 6.44 ఇంచెస్ పంచ్‌హోల్ డిస్‌ప్లే 
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 ప్రాసెసర్ 
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 
* 6/8/12 జీబీ ర్యామ్‌
* 64/128/256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
* 4,100 ఎంఏహెచ్ బ్యాట‌రీ 

కెమెరాలు
వెనుక‌వైపు నాలుగు కెమ‌రాలున్నాయి. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు స‌పోర్టింగ్‌గా 8,5,2 మెగాపిక్సెల్స్‌తో  మ‌రో మూడు కెమెరాలు ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం డ‌బుల్ సెల్ఫీ కెమెరా దీనిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌.  32 + 8 మెగాపిక్సెల్ డబుల్‌ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
 
ఇవీ వన్‌ప్లస్ నార్డ్ ధరలు
* 6 జీబీ ర్యామ్,  64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్‌  ధర రూ. 24,999 

* 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ ధర  రూ.27,999  

* 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడల్  ధర  రూ.29,999

అయితే  ఆగ‌స్ట్ 4న 8 జీబీ, 12 జీబీ ర్యామ్ వేరియంట్లు మాత్రమే దొరుకుతాయి. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ సెప్టెంబర్‌లో వస్తుంది. 


 

జన రంజకమైన వార్తలు