• తాజా వార్తలు
  •  

కొత్త ఏడాదిలో వ‌స్తున్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ఫోన్లు ఇవే

సాంకేతిక‌త వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో స్మార్టుఫోన్లు కూడా అందుకు త‌గ్గ‌ట్టుగా మారిపోతున్నాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాలకు త‌గ్గ‌ట్టుగా ఇప్పుడు వ‌చ్చే ఫోన్ల‌లో కూడా ఎన్నో మార్పులు వ‌స్తున్నాయి. ఆ ఫోన్లు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ టెక్నాల‌జీ ప్ర‌ధానంగానే బిల్ట్ అవుతున్నాయి.  2018 కొత్త ఏడాదిలో అలా మార్కెట్లోకి రాబోతున్న నాలుగు కొత్త ఫోన్ల గురించి తెలుసుకుందామా!

ఈ ల‌క్ష‌ణాలుంటేనే...
ప్ర‌స్తుతం వ‌స్తున్న ఫోన్ల‌లో కొన్ని ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు ఉంటేనే క‌స్ట‌మర్లు ఆస‌క్తి చూపిస్తున్నారు.  వాటిలో కెమెరా బెనిఫిట్స్ చాలా కీల‌క‌మైంది. కెమెరాలో  ఏఐ టెక్నాల‌జీ ఉప‌యోగిస్తే ఎదురుగా ఉన్న స‌బ్జెక్ట్‌ను డిటెక్ట్ చేసే అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల లాండ్ స్కేప్‌, ఫుడ్, ఫైర్ వ‌ర్క్ ఇలా ప్ర‌తి వ‌స్తువును గుర్తించి దానికి త‌గ్గ‌ట్టుగా ఫొటోల‌ను తీసుకోవ‌డంలో ఏఐ టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఏఐ టెక్నాల‌జీ వాడ‌డం వ‌ల్ల లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట‌ర్ ద్వారా ఒక భాష నుంచి మ‌రో భాష‌కు ఇమేజ్‌ను టెక్ట్స్‌తో పాటు మార్చ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. రియ‌ల్‌టైమ్‌లో డిఫ‌రెంట్ లాంగ్వేజ్‌ల‌ను ట్రాన్స్‌లేష‌న్ చేయ‌డానికి ఉప‌యోగించింది. యూజ‌ర్ బిహేవియ‌ర్‌కు త‌గ్గ‌ట్టుగా వేగంగా అడాప్ట్ చేసుకోవ‌డంలో కూడా ఏఐ టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాదు ఫోన్‌కు మ‌రింత సెక్యూరిటీ ఇవ్వ‌డంలో కూడా ఏఐ టెక్నాల‌జీది ప్ర‌త్యేక స్థానం

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్‌8 ప్ల‌స్‌, నోట్ 8
శాంసంగ్ ఇటీవ‌లే మార్కెట్లోకి తీసుకొచ్చిన ఏఐ టెక్నాల‌జీ ఉన్న ఫోన్ల‌లో గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్ల‌స్‌, నోట్ 8 ముందంజ‌లో ఉన్నాయి. ఇందులో ఉన్న బిక్స్ బే టెక్నాల‌జీ ద్వారా యూజ‌ర్ల బిహేవియ‌ర్‌ను బ‌ట్టి క‌మ్యూనికేష‌న్ జ‌రుగుతుంది. కంపాటిబుల్ యాప్స్ ద్వారా ఇది వ‌ర్క్ అవుతుంది. డివైజ్ వేగాన్ని పెంచ‌డం కోసం కూడా ఏఐ టెక్నాల‌జీ ప‌నికొస్తుంది. 

హాన‌ర్ వ్యూ 10
కిరిన్ 970 ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన ఫోన్ హాన‌ర్ వ్యూ 10 ఫోన్‌. దీనిలో న్యూట్ర‌ల్ నెట్‌వ‌ర్క్ ప్రాసెసింగ్ యూనిట్ వాడారు.  సెక్యూర్ ఫేస్ అన్‌లాక్‌, కెమెరా బెనిఫిట్స్‌, ట్రాన్స్‌లేష‌న్స్‌, ఎన్‌హేన్స‌డ్ ఆటోమెష‌న్‌, వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ ఇది.  ఏఐ టెక్నాల‌జీ వాడ‌డం వ‌ల్లే వీట‌న్నిటిని ఉప‌యోగించే అవ‌కాశం హాన‌ర్‌కు వ‌చ్చింది.

యాపిల్ ఐఫోన్ ఎక్స్‌
యాపిల్ స‌మ‌ర్పించిన ఐఫోన్ ఎక్స్ కస్ట‌మ‌ర్ల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. న్యూర‌ల్ ఇంజ‌న్‌తో పాటు ఎ11 బ‌యోనిక్ చిప్‌సెట్ టెక్నాల‌జీ దీనిలో ఉప‌యోగించారు. మెషిన్ లెర్నింగ్ ఏఐ ప్రాసెసింగ్ చాలా సుల‌భం దీనిలో.  ఫేసియ‌ల్ రిక‌గ‌నైజేష‌న్ సిస్ట‌మ్ (ఫేస్ డీ)  న్యూర‌ల్ ఇంజ‌న్ వ‌ల్ల ప‌ని చేస్తుంది.  ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ వ‌ల్ల మ‌రో సెక్యూరిటీ కూడా బాగుంటుంది. యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్ దీనిలో ఉంది.

గూగుల్ పిక్స‌ల్ 2, పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్‌
ఇటీవ‌లే గూగుల్ మార్కెట్లోకి తెచ్చిన గూగుల్ పిక్స‌ల్ 2, పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్ కూడా ఐఏ టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని త‌యారైన ఫోన్లే. విజువ‌ల్ కోర్ ప్రాసెస‌ర్ వల్ల సూప‌ర్ ఇమేజింగ్ కాప‌బిలిటీస్ దీనిలో ఉన్నాయి. యూజ‌ర్ల క‌మాండ్స్‌ను వారి ప్ర‌శ్న‌లను అర్ధం చేసుకుని దానికి అనుగుణంగా ప‌నులు చేయ‌డానికి గూగుల్ అసిస్టెంట్ కూడా దీనిలో ఉంది.

జన రంజకమైన వార్తలు