• తాజా వార్తలు

ప్రివ్యూ - ఏమిటీ ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్‌?

కార్లో వెళుతున్న‌ప్పుడు నావిగేష‌న్ కోస‌మో, బ్రౌజింగ్ కోస‌మే కార్‌లో ఉన్న సిస్ట‌మ్‌లో నెట్ వాడాలంటే ఏం చేస్తారు?  హాక్స్ కేబుల్ పెట్టి ఫోన్‌ను కార్ సిస్ట‌మ్‌కు క‌నెక్ట్ చేస్తారు. లేదంటే బ్లూటూత్‌తో పెయిర్‌చేసి వాడుకుంటారు. అయితే వీటిలో కేబుల్ పెట్టి వాడాలంటే మ‌న‌కు కాల్స్ వ‌స్తే ఇబ్బంది.  బ్లూటూత్ క‌నెక్టివిటీ అన్నిసార్లూ బాగాలేక‌పోవ‌చ్చు. దీనికి పరిష్కారం ఆండ్రాయిడ్ ఆటో ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది గూగుల్‌. ఇది వైఫై మీద ప‌ని చేస్తుంది. అంటే వైర్‌లెస్ అన్న‌మాట‌. 

ఇప్ప‌టికే ఐవోఎస్ డివైస్‌ల కోసం యాపిల్ కార్ ప్లే అందుబాటులో ఉంది. అలాగే ఆండ్రాయిడ్ యూజ‌ర్ల కోసం ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్‌ను తీసుకొచ్చింది గూగుల్‌. దీనికోసం కార్ త‌యారు చేసేట‌ప్పుడే సిస్టం డిజైన్‌లో మార్పుచేర్పులు చేస్తారు. యాపిల్ కార్ ప్లే కొన్ని నెల‌లుగా ప్రీమియం మోడ‌ల్ కార్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్పుడు అదే దారిలో ఆండ్రాయిడ్ కూడా న‌డుస్తోంది. 

ఇవి ఉండాలి
ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్ ఫీచ‌ర్‌ను వాడుకోవాలంటే మీ ద‌గ్గ‌ర నెక్స‌స్ లేదా గూగుల్ పిక్సెల్ ఫోన్ ఉండాలి.

* అది కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్‌తో అప్‌డేట్ అయిన ఫోన్ల‌లోనే ఈ ఫీచ‌ర్ ప‌ని చేస్తుంది.

* దీనితోపాటు మీ కారు ఆండ్రాయిడ్ ఆటో వీ3.1 ఓఎస్ (Android Auto v3.1)తో  ర‌న్న‌య్యే సెట‌ప్ ఉండాలి.  

* దీనికి సంబంధించిన కేబుల్ కూడా ఉండాలి. ఫ‌స్ట్ టైమ్ ఫోన్‌కు మీ కార్ డాష్‌బోర్డ్‌లోని సిస్ట‌మ్‌ను క‌నెర్ట్ చేయ‌డానికి ఈ కేబుల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఒక్క‌సారి సిస్ట‌మ్ క‌నెక్ట్ అయ్యాక ఇక కేబుల్‌తో ప‌ని లేదు. 

ప్ర‌స్తుతానికి ప‌రిమిత‌మే
ప్ర‌స్తుతం గూగుల్ పిక్స‌ల్, పిక్సెల్ ఎక్స్ ఎల్‌, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్సెల్‌, నెక్స‌స్ 5 ఎక‌స్‌, నెక్స‌స్ 6పీ ఫోన్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. పిక్సెల్ ఫోన్లు కాకుండా మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లు నిరాశ‌ప‌డ‌క్క‌ర్లేదు. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌కూ ఈ ఫీచ‌ర్ తీసుకొచ్చేలా గూగుల్.. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ల‌లోత్వ‌ర‌లో మార్పులు తీసుకురాబోతుంది. మ‌రోవైపు కార్ సిస్ట‌మ్‌కు కూడా ఈ ఫీచ‌ర్‌ను వాడుకునే సాఫ్ట్‌వేర్ కొత్త మోడ‌ల్స్‌లో తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఉన్నవాటికి జేవీసీ, కెన్‌వుడ్ కంపెనీల కార్ సిస్ట‌మ్‌ను ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు