• తాజా వార్తలు

స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి సెల‌బ్రిటీలు వ‌చ్చేస్తున్నారు. ఇటీవ‌ల స‌చిన్ టెండూల్క‌ర్ స్మార్ట్రాన్ కంపెనీతో క‌లిసి స్మార్ట్రాన్ ఎస్ఆర్‌టీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ సుల్తాన్ స‌ల్మాన్‌ఖాన్ వంతు. సల్మాన్ నెల‌కొల్పిన బీయింగ్ హ్యూమ‌న్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ బీయింగ్ స్మార్ట్‌ఫోన్ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. అతి త్వ‌ర‌లో బీయింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. అయితే దీని స్పెసిఫికేష‌న్స్‌, ప్రైస్ ఎలా ఉండబోతున్నాయో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచ‌ర్స్‌తో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గానే ఎంట‌ర్ కావ‌చ్చ‌ని టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా వేస్తున్నారు. ధ‌ర 8వేల నుంచి 20 వేల లోపు ఉండ‌వ‌చ్చ‌ని, అయితే హై రేంజ్ స్మార్ట్‌ఫోన్ల‌లో ఉండే ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉంటాయ‌ని స‌ల్మాన్ ఖాన్ చెప్పార‌ని స‌మాచారం.
స్పెసిఫికేష‌న్లు ఎలా ఉండొచ్చంటే..
* 5 ఇంచెస్ డిస్‌ప్లే
* క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్
* 2 జీబీ ర్యామ్
* 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
* 13 ఎంపీ రియ‌ర్ కెమెరా
* 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 2,800 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* 4జీ VoLTE నెట్‌వర్క్ స‌పోర్ట్

జన రంజకమైన వార్తలు