• తాజా వార్తలు

ప్రివ్యూ - విటమిన్ లు కావాలా ? అయితే షియోమీ సిగరెట్ తాగండి

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన షియోమీ కి విపరీతంగా జనాదరణ కలిగించే ఫ్లాట్ ఫాం ఒకటి ఉంది. అదే మిజియా ( MIJIA ). వివిధ రకాల సృజనాత్మక ఉత్పత్తుల ద్వారా ఇది షియోమీ కి విపరీతమైన జనాదరణ మరియు జనాకర్షణ కలిగిస్తుంది. Mi పెన్ నుండీ దానంతట అదే వేడి కలిగించే నాన్ ఎలక్ట్రో బ్లాంకెట్ ల వరకూ ఎన్నో రకాల సృజనాత్మక ఉత్పత్తులను ఇది అందించింది. ఇక తాజాగా ఒక ఈ- సిగరెట్ ను ఇది ప్రవేశపెట్టింది.పొగాకు ఆధారిత సిగరెట్ లకు ప్రత్యామ్నాయం గా ఇది తీసుకురాబడింది. ఇది ఆరోగ్యానికి తక్కువ హాని చేస్తుంది. ఈ పరికరం లో ఒక లిక్విడ్ ఉంటుంది. దానిని వేడి చేయడం ద్వారా ఈ సిగరెట్ వెలిగించబడుతుంది.అది ఒక ఎరోజల్ ను ఏర్పరుస్తుంది. సిగరెట్ తాగేవారు ఈ ఎరోజల్ ను పీలుస్తారు. ఈ ప్రక్రియను వాపింగ్ అని అంటారు.ఈ ఈ- సిగరెట్ లు సాధారణంగా నికోటిన్ మరియు నాన్ నికోటిన్ ఫ్లేవర్ లలో లభిస్తాయి. నికోటిన్ కాకుండా ప్రోపిలీన్ గ్లైకాల్, గ్లిసరిన్, మరియు ఇతర ఫ్లేవర్ లలో కూడా లభిస్తాయి.

ఈ షియోమీ మిజియా ఈ సిగరెట్ ఒక స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడుతుంది. ఇది 12 సెంమీ పొడవు మరియు ఒక సెంటీమీటర్ మందం కలిగి ఉంటుంది.పొగను తీసుకోడానికీ మరియు ఎయిర్ ఫ్లో కంట్రోల్ కోసం ఇది టెక్నాలజీ ని ఉపయోగించుకుంటుంది. ఇది చూడడానికి స్కెచ్ పెన్ లా ఉంటూ వివిధ రకాల రంగులలో ఉంటుంది.మీరు దీనిద్వారా గాలి ని పీల్చేటపుడు ఒక led లైట్  వెలుగుతుంది.

ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ప్రస్తుతం  మార్కెట్ లో అనేక రకాల ఈ- సిగరెట్ లు దొరుకుతున్నాయి కదా! వాటికీ దీనికీ తేడా ఏమిటి? ఇందులో విశిష్టత ఏమిటి? అక్కడకే వస్తున్నా! ఈ షియోమీ మిజియా ఈ-సిగరెట్ జీరో క్యాలరీ లను కలిగి ఉండడమే గాక విటమిన్ C, A, B6 మరియు B12 లను వీటి కో ఎంజైమ్ లతో కలిపి లోడ్  చేయబడి ఉంటుంది. ఇవి మాత్రమే కాక మన శరీరానికి అవసరం అయ్యే అనేకరకాల మైక్రో న్యూట్రిఎంట్ లను కలిగి ఉంటుంది. ఈ సిగరెట్ లోని అన్ని భాగాలు ఫిక్స్డ్ గా ఉంటాయి. ఓపెన్ చేయడం గానీ రీఫిల్ చేయడం కానీ కుదరదు. ఒక్కో సిగరెట్ సుమారు 500 వాపింగ్ ల వరకూ వస్తుంది.

దీని ధర సుమారు రూ 1800/- ల వరకూ ఉంటుంది. ఇది గ్రీన్ ఆపిల్, ద్రాక్ష, స్వీట్ వెనిలా మరియు మెంథాల్ మింట్ ఫ్లేవర్ లలో లభిస్తుంది.

జన రంజకమైన వార్తలు