• తాజా వార్తలు

సైలెంట్‌గా మార్కెట్లోకి దూసుకురాబోతున్న జియోమి రెడ్‌మి నోట్ 5ఎ

జియోమి.. ఈ కంపెనీకి భార‌త్‌లో ఉన్న మార్కెట్ పెద్ద‌దే. స్మార్ట్‌ఫోన్ల హవా మొద‌ల‌య్యాక‌.. జ‌నం బాగా ఫోన్ల‌కు అల‌వాటుప‌డిపోయాక జియోమి బాగా పుంజుకుంది. ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా కొత్త కొత్త మోడ‌ల్స్‌ను రంగంలోకి దింపుతూ ఈ సంస్థ రోజు రోజుకూ బ‌ల‌ప‌డుతోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, నోకియా, జియో ఫీచ‌ర్‌ ఫోన్లు రంగంలోకి దిగిన త‌ర్వాత జియోమి కూడా వాటికి పోటీగా రాబోతోంది.  ముంద‌స్తుగా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు లేకుండా ఈనెల 21నే ఈ ఫోన్ రాబోతోంద‌ని స‌మాచారం. మ‌రి  ఏంటి ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు?

స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌
జియోమి రెడ్‌మి నోట్ 5ఏ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 625 ఎస్ఓసీ ప్రాసెస‌ర్ ఉప‌యోగించారు. దీంతో ఫోన్ మ‌రింత వేగంగా ప‌రుగెత్త‌డం ఖాయ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. రెడ్‌మి నోట్ 4, రెడ్ మి నోట్ 5లకు కొన‌సాగింపుగానే ఈ కొత్త ఫోన్‌ను ఆ కంపెనీ బ‌రిలో దించ‌నుంది. ఈ కొత్త ఫోన్‌ను ఎండీఈ6ఎస్‌, ఎండీటీ6ఎస్ మోడ‌ల్స్‌లో తీసుకొస్తుంది ఈ కంపెనీ. స్నాప్‌డ్రాగ‌న్ 625 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌తో పాటు 5.5 అంగుళాల ఫుల్ హెడ్‌డీ డిస్‌ప్లే,తో దీని లుక్ అదిరిపోనుంది. ఈ డివైజ్ సామ‌ర్థ్యం 3 జీబీ, 4 జీబీ ర్యామ్‌ల‌తో త‌యారు చేస్తున్నారు.  అయితే స్టోరేజ్ ఆప్ష‌న్లకు వ‌స్తే ఈ రెండు మోడ‌ల్స్‌లో భిన్న‌మైన స్టోరేజ్ ఆప్ష‌న్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగ‌ట్ సాంకేతిక‌త‌తో ఈ ఫోన్లు త‌యారు అయ్యాయి. 

13 ఎంపీ... 5 ఎంపీ
ఈ రెడ్‌మి  నోట్ 5 ఏ ఫోన్లో కెమెరా కూడా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆప్ష‌న్‌. 13 ఎంపీ రేర్ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీనిలో ఉంది. ముఖ్యంగా సెల్ఫీల కోసం ఈ ఫోన్ చాలా ప్ర‌త్యేకంగా రూపొందించారు. 4100 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఈ ఫోన్‌కు ఉన్న మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. దీని వ‌ల్ల ఒక రోజు పాటు ఫోన్‌ను ఉప‌యోగించినా బ్యాట‌రీతో ఇబ్బంది ఉండ‌దు. గ‌తేడాది విడుద‌లైన రెడ్‌మి నోట్ 4 ఏకంగా 5 మిలియ‌న్ల యూనిట్లు అమ్ముడ‌పోయి రికార్డు సృష్టించింది. ఇప్పుడు రెడ్ మి నోట్ 5ఏ ఈ రికార్డును తిర‌గ రాయ‌గ‌ల‌ద‌ని నిపుణులు భావిస్తున్నారు.
 

జన రంజకమైన వార్తలు