• తాజా వార్తలు

ఈ క‌స్ట‌మ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ క‌ట్ చేయ‌నున్న జియో

ఊహించిన‌ట్లుగానే  రిలయన్స్ జియో  వాయిస్ కాల్స్‌కు లిమిట్ పెట్టేసింది.  ఇంత‌కుముందు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉండేవి.  జియో యూజర్లకు VoLte సర్వీస్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇస్తోంది. దీన్ని ఇలాగే కొనసాగించినా జియో కు లాసేమీ లేదు. కానీ కొంతమంది యూజర్లు ఈ ఫ్రీ వాయిస్ కాల్స్ ను మిస్ యూజ్ చేస్తున్నారని జియోకు స‌మాచారం అందింది.   దీంతో జియోను క‌మ‌ర్షియ‌ల్ యూసేజ్ లేదా ఫ్రాడ్ లెంట్ స‌ర్వీసుల‌కు  వాడుతున్నార‌ని తేలితే  వాటికి లిమిట్ ఆటేమేటిగ్గా అప్ల‌యి అవుతుంది.

ఇదీ లిమిట్    

అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్‌ను మిస్‌యూజ్ చేసేవారికి ఈ లిమిట్ పెట్ట‌బోతుంది.   దీని ప్ర‌కారం రోజుకు 300 నిముషాలు దాటితే వాయిస్ కాల్స్ పోవు.  వారానికి 1200 నిముషాలు లేదా, 28 రోజుల‌కు 3వేలు నిముషాలు వీటిలో ఏది ముందైతే అది వ‌ర్తిస్తుంది.

లిమిట్ దాటితే

ఈ లిమిట్ దాటితే వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే రీఛార్జి చేసుకోవాల్సిందే. అయితే ఎంత అమౌంట్‌తో రీఛార్జి చేసుకోవాల‌న్న వివ‌రాల‌ను జియో ప్ర‌క‌టించ‌లేదు. వారం రోజుల పిరియ‌డ‌ల్‌లో 100 యూనిక్ MSIDNsల‌కు కాల్ చేసినా లిమిట్ దాటిన‌ట్లే.
 

జన రంజకమైన వార్తలు