• తాజా వార్తలు

 ఎయిర్‌టెల్ సిమ్ ఓన‌ర్ డిటెయిల్స్  క‌నుక్కోవ‌డం ఎలా? 

మీరు సిమ్ కార్డు ఏ ఐడీ ప్రూఫ్‌తో తీసుకున్నారు?  మీ పూర్తి పేరుతోనే సిమ్ తీసుకున్నారా?  అస‌లు ఏ అడ్ర‌స్‌తో తీసుకున్నారు?సిమ్ కార్డు తీసుకునేట‌ప్పుడు డేట్ ఆఫ్ బ‌ర్త్ ఏం చెప్పారు? ఇలాంటి వివ‌రాల‌న్నీ మీకు గుర్తున్నాయా? అయితే ప‌ర్వాలేదు.  ఒక‌వేళ సిమ్ కార్డు తీసుకుని చాలా సంవ‌త్స‌రాల‌యితే వాటిని మ‌ర్చిపోయే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా త‌ర‌చూ ట్రాన్స్‌ఫ‌ర్‌లు అయ్యే ఉద్యోగులు ఏ అడ్ర‌స్‌తో సిమ్ తీసుకున్నారో కూడా మ‌ర్చిపోయి ఉంటారు. కానీ మీరు మొబైల్ క‌నెక్షన్‌కు సంబంధించి  క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేస్తే ఫ‌స్ట్ వాళ్లు అడిగేది మీ పేరు, డేట్ ఆఫ్ బ‌ర్త్‌. ఒక్కోసారి మీ ఈమెయిల్ ఐడీ, కంపెనీ పేరు లేదా అడ్ర‌స్ వంటివి కూడా అడ‌గొచ్చు.  మీరు ఎయిర్‌టెల్ యూజ‌ర్ అయితే మీ సిమ్ డిటెయిల్స‌న్నీ చాలా ఈజీగా తెలుసుకోవ‌చ్చు.  పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్ యూజ‌ర్లంద‌రికీ ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. 
చెక్ చేసుకోవ‌డం ఇలా
1. Airtel.in Selfcare లాగిన్ పేజీలోకి వెళ్లండి.
2. మీ మొబైల్ నెంబ‌ర్‌, పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్‌చేయండి. పాస్‌వ‌ర్డ్ గుర్తు లేక‌పోతే గెట్ ఓటీపీ  క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.దానితో ఎంట‌ర్ కావ‌చ్చు. 
3. లాగిన్ అయ్యాక Airtel Manage account pageలోకి వెళ్లండి.
4. ఇక్క‌డ మీకు సిమ్ ఓన‌ర్ పేరు కనిపిస్తుంది. నెంబ‌ర్ మీద క్లిక్ చేస్తే డిటెయిల‌న్నీక‌నిపిస్తాయి.
ఏయే వివ‌రాలుంటాయంటే..
సిమ్ ఓన‌ర్ పేరు, రెసిడెన్షియ‌ల్ అ్ర‌డ‌స్‌, సిమ్ యాక్టివేష‌న్ డేట్‌, స్టేట‌స్‌, ప్రీ పెయిడా, పోస్ట్‌పెయిడా, క‌స్ట‌మ‌ర్ ఐడీ వంటి వివ‌రాల‌న్నీక‌నిపిస్తాయి.

జన రంజకమైన వార్తలు