• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. ఈ సీక్రెట్ కోడ్స్ మీకోస‌మే

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం. ఐఎంఈఐ నెంబ‌ర్ చెప్ప‌మంటే త‌డుముకుంటాం. బ్యాట‌రీ స్టేట‌స్ చెక్ చేసుకోవాల‌న్నా, ఫోన్ యూసేజ్ తెలుసుకోవాల‌న్నా గంద‌ర‌గోళ‌మే. కెమెరా ఇన్ఫ‌ర్మేష‌న్, ర్యామ్ వెర్ష‌న్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటివ‌న్నింటికీ ఆండ్రాయిడ్‌లో యూఎస్ఎస్‌డీ కోడ్స్ ఉన్నాయి.  వీటిని ఫోన్ డ‌య‌ల‌ర్‌లో డ‌య‌ల్ చేసి కాల్ చేస్తే చాలు ఇన్ఫ‌ర్మేష‌న్ తెలిసిపోతుంది. 
ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్ 
1. ఐఎంఈఐ నెంబ‌ర్ చెక్ చేసుకోవ‌డానికి   *#06#
2. బ్యాట‌రీ స్టేట‌స్ చెక్ చేసుకోవాలంటే *#0228#
3. ఫోన్ బ్యాట‌రీ గురించి, ఫోన్ యూసేజ్ తెలుసుకోవ‌డానికి   *#*#4636#*#*
కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఈకోడ్ టైప్ చేస్తే ఫోన్ ఇన్ఫ‌ర్మేష‌న్‌, యూసేజ్ స్టాటిస్టిక్స్‌, బ్యాట‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్‌, వైఫై ఇన్ఫ‌ర్మేష‌న్ వంటివన్నీ తెలుసుకోవ‌చ్చు.
4. కెమెరా ఇన్ఫ‌ర్మేష‌న్ తెలుసుకోవ‌డానికి   *#*#34971539#*#*
5. ర్యామ్ వెర్ష‌న్ చెక్ చేసుకోవ‌డానికి  *#*#3264#*#* 
6. ఆండ్రాయిడ్ డివైస్‌ను ఫార్మాట్ చేయాలంటే..  *2767*3855#

జన రంజకమైన వార్తలు