• తాజా వార్తలు
  •  

మీ వీడియో లని కామిక్ బుక్ స్ట్రిప్స్ గా మార్చే టిప్స్ మీ కోసం

స్మార్ట్ ఫోన్ లు అనేక రకాల స్కిల్స్ ను వినియోగదారులకు అందిస్తాయి. సాధారణంగా వీటిపై పట్టు సాధించాలి అంటే చాలా సమయం పడుతుంది. వీడియో ఎడిటింగ్, లాంగ్వేజ్ లు మొదలైనవి ప్రస్తుతం ఎక్కువగా వాడబడుతున్న వాటిలో కొన్ని.అలాంటి స్కిల్స్ ను ప్రతీ ఒక్కరికీ చేరవేయాలనే ఉద్దేశం తో ఒక సరికొత్త యాప్ ను లాంచ్ చేసింది. అదే స్టొరీ బోర్డు యాప్.కంపెనీ యొక్క యాప్రెసిమెంట్స్ అనే ఒక వినూత్న కార్యక్రమo లో భాగంగా ఈ యాప్ప్ ను విడుదలచేయడం జరిగింది. ఇది మీ వీడియో లను కామిక్ బుక్ స్ట్రిప్స్ గా మారుస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

ముందుగా ప్లే స్టోర్ లోనికి వెళ్లి ఈ స్టొరీ బోర్డు యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇది పూర్తి ఉచితంగా లభిస్తుంది.

దీనిని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత దీనిని ఓపెన్ చేసి మీ ఫోన్ లో ఉన్న వీడియో ను ఈ యాప్ లోనికి ఇంపోర్ట్ చేయాలి. ఇది ఆ ఫైల్ ను ప్రాసెస్ చేస్తుంది.వెంటనే మీ వీడియో కామిక్ బుక్ గా మారిపోతుంది.

ఇందులో మరొక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. మీ ఫైల్ కామిక్ బుక్ గా రెడీ అయిన వెంటనే ఈ యాప్ వివిధ రకాల ఫిల్టర్ లు , లే అవుట్ ల ద్వారా షఫుల్ చేసి మాకు మరొక స్ట్రిప్ ను అందిస్తుంది. ఇలా మీకు నచ్చిన కామిక్ బుక్ స్ట్రిప్ వచ్చేవరకూ మీరు ఈ ప్రక్రియను కొనసాగించవచ్చు.

ఈ స్ట్రిప్ పై ట్యాప్ చేస్తే మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి. అవి ఒకటి వీడియో ను లోడ్ చేయడం, రెండవది సేవ్ చేయడం మూడవది షేర్ చేయడం.

ఎక్కువ పేజి లు కావాలి అంటే ప్రస్తుతానికి ఈ సౌకర్యం ఈ యాప్ లో అందుబాటులో లేదు. అయితే మీ ఒరిజినల్ వీడియో ను క్లిప్ లు గా మార్చుకొని ఒకదాని తర్వాత ఒకటి స్ట్రిప్ లుగా మీరు వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత pdf బిల్డర్ లాంటి యాప్ లను ఉపయోగించి వాటన్నింటినీ ఒకేచోట ఉంచవచ్చు.

ఇదీ ఈ స్టొరీ బోర్డు యాప్ గురించి. వాస్తవానికి ఇది ప్రాథమిక దశ లో ఉండే యాప్ గానే కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ప్రయోగాత్మక యాప్ మాత్రమే కాబట్టి పెద్ద పెద్ద ఫ్లాట్ ఫాం లైన గూగుల్ ఫోటోస్ లాంటి వాటికి ఇది దారిని సులువు చేస్తుంది

జన రంజకమైన వార్తలు