• తాజా వార్తలు

అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

ప్ర‌జ‌ల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ల బిజినెస్ ఇండియాలో ఊపందుకుంటోంది. అందుకే 3, 4వేల‌కు దొరికే సాధార‌ణ ఫిట్ నెస్ ట్రాకింగ్ వేర‌బుల్స్ నుంచి 50 వేల ఖ‌రీదు చేసే యాపిల్ ఉత్ప‌త్తుల వ‌ర‌కు మంచి మార్కెట్ ఉంది. ఇందులో ఫిట్‌బిట్ లాంటి మిడ్ రేంజ్ వాటికి మంచి ఆద‌ర‌ణ ఉంది.  ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా హ‌లో పేరుతో ఓ ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌ను యూఎస్‌లో రిలీజ్ చేసింది. త్వ‌ర‌లో ఇండియాలోనూ లాంచ్ చేయ‌బోతోంది. మంచి ఫీచ‌ర్ల‌తో అంద‌రూ కొన‌గలిగే ధ‌ర‌లోనే దీన్ని తీసుకొచ్చామ‌ని అమెజాన్ చెబుతోంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌తో క‌నెక్ట్ చేసుకోవ‌డానికి హ‌లో పేరిట ఓ ప్ర‌త్యేక యాప్‌ను కూడా రిలీజ్ చేసింది. 

అమెజాన్ హ‌లో ఫీచ‌ర్లు
* రెండు మైక్రోఫోన్లు
* క‌నెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0
* 7 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్
* |హార్ట్ రేట్ ట్రాక‌ర్ 
* స్టెప్ కౌంట‌ర్‌
* కాల్‌, మెసేజ్ నోటిఫికే|ష‌న్స్‌
* మూడు రంగుల్లో ల‌భిస్తుంది.


ఈ 2 ఫీచ‌ర్లు స్పెష‌ల్ 
టోన్‌:
అమెజాన్ హ‌లోలో టోన్ అనే ఫీచ‌ర్ ఉంది. ఇది మీ వాయిస్‌ను విశ్లేషించి మీ వాయిస్‌లో పాజిటివిటీ, ఎనర్జీ ఎంతుందో చెబుతుంది. దీంతో మీరు మ‌రింత మెరుగ్గా మాట్లాడి క‌మ్యూనికేష‌న్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. మెషీన్ లెర్నింగ్‌తో ఇది ప‌నిచేస్తుంది.

బీఎఫ్ఎం: అమెజాన్ హ‌లోలో ఉన్న మ‌రో |ఫీచ‌ర్ బీఎఫ్ఎం (బాడీ ఫ్యాట్ మెజ‌ర్‌మెంట్‌). హ‌లోలో ఉన్న 3డీ స్కాన్ ఫీచ‌ర్ ధ‌రించిన‌వారి బాడీలో ఉండే ఫాట్ ప‌ర్సంటేజ్‌ను కూడా చెప్పేస్తుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌తో ఈ ఫీచ‌ర్ స‌మ‌ర్థవంతంగా ప‌ని చేస్తుంది.

ధ‌ర‌
యూఎస్‌లో దీని ధ‌ర 100 డాల‌ర్లు అంటే మ‌న రూపాయ‌ల్లో 7,383.  ప్రారంభ ఆఫ‌ర్గా 65 డాల‌ర్లు (4,800 రూపాయ‌ల)కే అందిస్తుంది.  ఈ ధ‌ర‌లో ఈ స్థాయి ఫీచ‌ర్ల‌తో ఇండియాలో లాంచ్ అయితే మార్కెట్లో మంచి వాటా ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మే.
 

జన రంజకమైన వార్తలు