• తాజా వార్తలు

ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది.  దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను ఆదేశించింది. తాము ఆ పని చేయలేమంటూ ట్విట్టర్ తెగేసి చెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను ఇండియాలో నిలిపివేసినట్టు మాత్రం చెప్పింది . ట్విట్టర్ రైతుల ఆందోళనపై సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారానికి అతిపెద్ద వేదికగా మారిందని మోడీ ప్రభుత్వం ట్విట్టర్ పై ఆగ్రహంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మన సొంత మైక్రో బ్లాగింగ్ యాప్ కూ (Koo)ను తెరపైకి తెచ్చింది.                                

ఈ కూ యాప్ విశేషాలేమిటంటే..
ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ యాప్ ను 2020 మార్చిలో అందుబాటలోకి  తెచ్చారు. ఆండ్రాయిడ్, ఐవోయస్ యాప్ స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఈ కూ యాప్‌ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.  

1) కూ లో హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ భాషల్లో పోస్టులు రాయవచ్చు .                              

2)కూ వినియోగదారులు పోస్ట్‌లు, ఆడియో, వీడియో, ఫోటోలను షేర్ చేయవచ్చు..                          

3)వివిధ రకాల పోల్స్ కూడా నిర్వహించవచ్చు. DMల ద్వారా చాటింగ్ చేసుకోవచ్చు.

4 ) ట్విట్టర్లో క్యారెక్టర్స్ 280కే పరిమితం. కూ యాప్ లో దీని పరిమితి 400 పదాలు ఉంది. అంటే పెద్ద పోస్ట్ అయితే  2 ట్వీట్లు చేసే బదులు ఒక్క కూ పోస్ట్ చేస్తే చాలు.

జన రంజకమైన వార్తలు