• తాజా వార్తలు

ఎట్ట‌కేల‌కు రెండేళ్ల త‌ర్వాత ఐఆర్‌సీటీసీ యాప్ అప్‌డేట్‌.. కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

ఇండియ‌న్ రైల్వేలో టికెట్ బుకింగ్ కోసం రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ నెక్స్‌ట్ జనరేషన్ ఇ-టికెటింగ్ (NGeT) సిస్టమ్ 2014లో లాంచ్ అయింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, రైల్ క‌నెక్ట్ యాప్‌ల్లో రోజూ 8లక్ష‌ల టికెట్స్ ఇందులో బుక్ అవుతుంటాయి. కానీ ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన రైల్వే యాప్ కాబ‌ట్టి దీనిలో అప్‌డేట్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి.  మామూలు యాప్‌లు వారానికి నాలుగుసార్లు అప్‌డేట్లు ఇచ్చి నెల‌కో, రెండు నెల‌ల‌కో యాప్ లుక్కే మార్చేస్తుంటాయి. కానీ ఐఆర్‌సీటీసీ యాప్ దాదాపు రెండేళ్లుగా పెద్ద మార్పులేమీ లేకుండా అలాగే కొన‌సాగుతోంది. అయితే ఇటీవ‌ల ఈ యాప్‌ను బాగా మాడిఫై చేశారు. దీనిలో కొత్త ఫీచ‌ర్లేమిటో చూద్దాం.   పండ‌గ సీజ‌న్‌లో ఈ కొత్త వెర్ష‌న్ యాప్‌తో టికెట్లు బుక్ చేసుకోవ‌డానికి ఎంత ఈజీగా ఉందో ఓ లుక్కేద్దాం.

స్మార్ట్ బుకింగ్‌
ఐఆర్‌సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్-CRIS కలిసి 'స్మార్ట్ బుకింగ్' ఫీచర్‌ను రూపొందిస్తున్నాయి. డైరెక్ట్ ట్రైన్స్‌లో టికెట్స్ దొరక్క‌పోతే ఆల్ట‌ర్నేట్  రూట్స్, కనెక్టింగ్ ట్రైన్స్‌ను ఈ స్మార్ట్ బుకింగ్ ఫీచర్ మీకు సజెస్ట్ చేస్తుంది. 


ఇంటిగ్రేటెడ్ బుకింగ్‌
రైలు టికెట్‌తోపాటు మీకు వెళ్లిన‌చోట అకామిడేష‌న్ కూడా కావాలా? అయితే ఐఆర్‌సీటీసీ యాప్‌లో ఆ ఫీచ‌ర్ కూడా అందుబాటులో ఉంది. ఇదివ‌రకు విడిగా చూసుకోవాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బుకింగ్ ద్వారా అకామడేషన్ సులువుగా బుక్ చేయొచ్చు. దీనిలో లాస్ట్ ట్రాన్సాక్షన్స్ వివరాలు ఈజీగా చూసుకోవచ్చు. టికెట్లు క్యాన్సిల్ చేసినా, లేదా క్యాన్సిల్ అయినా అన్ని టికెట్ల రిఫండ్ స్టేటస్ ఒకేచోట కనిపిస్తుంది. 

ప్రెడిక్టివ్ ఎంట్రీ 
ఈ ఆప్షన్తో  రైలు టికెట్ల క‌రెంట్ వేగంగా,  చాలా కచ్చితంగా తెలుస్తుందని ఐఆర్‌సీటీసీ చెబుతోంది. అంతేకాదు బుకింగ్ టైమ్‌లో పేమెంట్ కూడా ఈజీ అవుతుంది. 

ఫేవ‌రెట్ జ‌ర్నీ
ఈ ఫీచ‌ర్‌ను మీరు అనేబుల్ చేసుకుంటే మీరు రెగ్యుల‌ర్‌గా వెళ్లే జ‌ర్నీ వివ‌రాలు ప్ర‌తిసారి ఎంట‌ర్ చేయ‌క్క‌ర్లేదు. ఫేవ‌రెట్ జ‌ర్నీ క్లిక్ చేస్తే మీ డిటెయిల్స్ ఆటో ఫిల్ అవుతాయి.  బుకింగ్ చేసేట‌ప్పుడు అన్ని క్లాసుల్లో అందుబాటులో ఉన్న బెర్తుల వివరాలు, కన్ఫ‌ర్మేష‌న్ ఛాన్సెస్ చూపిస్తుంది. ట్రైన్‌, క్లాస్ సెల‌క్ట్ చేసుకుని సింగిల్ క్లిక్‌తో బుక్ చేయొచ్చు.  


వన్ క్లిక్ 
ఇదో కొత్త ఫీచ‌ర్‌. దీనిలో ట్రైన్ వివరాలు, మీల్స్ బుకింగ్, అకామిడేషన్ లాంటివన్నీ ఒక్క క్లిక్‌తో బుక్ చేయొచ్చు. ప్రయాణికులకు ఇంటెలిజెంట్ జర్నీ, స్టేషన్ సజెషన్స్ లభిస్తాయి. రైళ్లను సెర్చ్ చేయడం ఈజీ అయింది.

జన రంజకమైన వార్తలు