• తాజా వార్తలు

3 నెల‌ల్లో 3 కోట్ల డౌన్‌లోడ్స్‌.. దుమ్మురేపుతున్న చింగారి యాప్‌

టిక్‌టాక్ ఇండియాలో పిచ్చ ఫేమ‌స్ అయింది. చైనా ప్రొడ‌క్ట్ అని ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ దాన్ని బ్యాన్ చేయ‌డంతో అలాంటివే ఇండియ‌న్ యాప్స్‌కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది. రోపోసో, చింగారి లాంటి యాప్స్ ఇప్పుడు భారీ డౌన్‌లోడ్స్‌తో దూసుకెళుతున్నాయి.

మేడిన్ ఇండియా యాప్‌

షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌గా వ‌చ్చిన చింగారి మంచి డౌన్‌లోడ్స్ క‌న‌బ‌రుస్తోంది. ఇది మేడిన్ ఇండియా యాప్‌. మూడు నెలల్లోనే ఏకంగా 3 కోట్ల డౌన్‌లోడ్స్ సాధించామ‌ని చింగారీ అంటోంది. ఇందులో ఎక్కువ మంది 18 నుండి 35 ఏజ్ గ్రూప్‌వాళ్లేన‌ట‌.

ఏఆర్ ఫిల్ట‌ర్స్‌

టిక్‌టాక్ రేంజ్ అందుకోవాలంటే అంత‌కంటే అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉండాల‌ని ఇండియ‌న్ యాప్ డిజైన‌ర్స్ మాట‌. చింగారిలో ఏఆర్ ఫిల్ట‌ర్స్ పెట్ట‌డం అందుకేనంటున్నారు. ఇండియ‌న్ యాప్ కాబ‌ట్టి హిందీ, బెంగాలీ, గుజ‌రాతీ, మ‌రాఠీ, క‌న్న‌డ‌, త‌మిళ్, తెలుగు, పంజాబీ, మ‌ళ‌యాళం, ఒడియా వంటి ఇండియ‌న్ లాంగ్వేజ‌స్ అన్నింట్లోనూ ఈ యాప్ ఉంది. అందుకే ఇండియాలోనే కాదు మ‌నోళ్లు ఎక్క‌వుగా ఉండే దుబాయ్‌, అమెరికా, కువైట్‌, సింగ‌పూర్ లాంటి దేశాల్లోనూ చింగారీకి చాలా డౌన్‌లోడ్స్ వ‌స్తున్నాయి.

జన రంజకమైన వార్తలు