• తాజా వార్తలు

టిక్‌టాక్‌కు పోటీగా అలాంటి ఫీచ‌ర్‌నే తీసుకురాబోతున్న  యూట్యూబ్‌?

బ్యాన్ చైనా ప్రొడ‌క్ట్స్ నినాదం ఇప్పుడు యాప్స్ మీద కూడా ప్ర‌భావం చూపుతోంది. యూసీ బ్రౌజ‌ర్‌, టిక్‌టాక్‌, కామ్‌స్కాన‌ర్, జూమ్‌ లాంటి చైనా యాప్స్‌ను కూడా ఇండియ‌న్ యూజ‌ర్లు ఫోన్ల‌లో నుంచి తొల‌గించాల‌న్నడిమాండ్ వినిపిస్తోంది. ఇవ‌న్నీ బాగా పాపుల‌ర్ అయిన యాప్స్ కావ‌డంతో వాటికి పోటీగా యాప్స్ తెచ్చేందుకు యూట్యూబ్‌, గూగుల్ లాంటి సంస్థ‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా ఇండియ‌న్ యూజ‌ర్ల‌ను విశేషంగా అల‌రిస్తున్న టిక్ టాక్‌కు పోటీగా యూ ట్యూబ్ ఓ కొత్త ఫీచ‌ర్ను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  

ఏంటి విశేషాలు?
* టిక్‌టాక్ లాగానే ఈ యూట్యూబ్ ఫీచ‌ర్ కూడా వీడియో కంటెంట్‌తో ఉంటుంది. 

* అయితే దీనిలో మ్యాగ్జిమం 15 సెక‌న్ల వీడియోలు మాత్ర‌మే పోస్ట్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువ వీడియోలను అప్‌లోడ్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఫీచ‌ర్‌లో రికార్డ్ చేయ‌కుండా మీ ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్‌లోడ్ చేయొచ్చు. 

*  ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండిండిలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు యూట్యూబ్ ప్ర‌క‌టించింది.  

* ప్ర‌స్తుతానికి కొద్దిమందికే ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చి ప‌రీక్షిస్తోంది. క్లిక్క‌యితే భారీ స్థాయిలో లాంచ్ చేయ‌బోతుంది. 

టిక్‌టాక్‌కు పోటీ ఇస్తుందా?
* టిక్‌టాక్‌లో వీడియో కంటెంట్‌తోపాటు మ్యూజిక్ స‌పోర్ట్ ఉంటుంది. 

* ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్ట్‌లు కూడా ఉన్నాయి.

* వీట‌న్నింటినీ యూట్యూబ్ కూడా ఇవ్వ‌గ‌లిగితేనే ఆ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోగ‌లుగుతుంది. 
 

జన రంజకమైన వార్తలు