• తాజా వార్తలు

ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 బెస్ట్ ఫ్రీ సెల్ఫీ యాప్స్ 

సెల్ఫీకి ఇంత‌కు ముందు ఉన్నంత క్రేజ్ లేదు.. అని అక్క‌డ‌క్క‌డా ఆర్టిక‌ల్స్‌లో చ‌దువుతుంటాం.  ఔనేమో అనుకుంటాం. కానీ ఏదైనా మంచి ప్లేస్‌కు వెళ్లగానే అరే ప్లేస్ భ‌లే ఉందే అనిపిస్తుంది. వెంట‌నే ఫోన్ తీసుకుని సెల్ఫీ క్లిక్‌మనిపిస్తాం. అది వాట్సాప్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాం. అదీ సెల్ఫీ క్రేజ్‌.  ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాప్ కల్చర్‌లో సెల్ఫీలు ఒక భాగమయ్యాయి. మిమ్మల్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా సెల్ఫీలు తీసుకునేందుకు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో సెల్ఫీలు తీసుకుని,ఎడిట్ చేసుకుని...స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.  మీకు కావాల్సిన అందమైన సెల్ఫీలను తీసుకునే 5 బెస్ట్ ఫ్రీ యాప్స్ ఉన్నాయి.
1.  రిట్రీకా (retrica)
ఇది పర్ఫెక్ట్ సెల్ఫీ కెమెరా యాప్. ఇందులో వందకు పైగా ప్రత్యేక ఫిల్టర్లు ఉన్నాయి. రకరకాల వింటేజ్ లు, విల్లాలు కనిపిస్తాయి. వాటితో మీకు నచ్చినట్లుగా సెల్ఫీలు తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని యాప్స్ లోనూ అత్యధిక రేటింగ్ పొందిన యాప్. ఈ యాప్ ఇప్ప‌టివ‌ర‌క 300మిలియన్ల డౌన్‌లోడ్స్ వ‌చ్చాయి.  సాధారణ యాజర్ ఇంటర్‌ఫేస్‌తో ఉండ‌డంతో ఎవ‌రైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. మీ ఫోటోలను కాలేజ్‌లుగా మార్చ‌డం, షాట్స్ లేదా వీడియోలు జిఫ్‌లకు ట్యాప్, షఫుల్ ఫిల్టర్లకు ఫోటోలను అప్లై చేయవచ్చు.
2. సెల్ఫీజెనిక్ కెమెరా (B12-selfiegenic camera)
ప్రముఖ మెసేజింగ్ యాప్ లైన్ కార్పొరేషన్.. ప్రత్యేకంగా సెల్ఫీల కోసం ఈ యాప్‌ను డెవ‌ల‌ప్‌చేసింది. స్మార్ట్‌ఫోన్ల‌లో  ఇన్‌బిల్ట్‌గా ఉన్న ఆప్ష‌న్స్‌కు దీటుగా ప్రత్యేకమైన సెల్ఫీలను డిజైన్ చేసేందుకు దీన్ని తీర్చిదిద్దారు. ఇప్ప‌టివ‌ర‌కు 30కోట్ల డౌన్‌లోడ్స్ వ‌చ్చాయి. సెల్ఫీజెనిక్ కెమెరా యాప్‌లో  ఉన్న వెరైటీ  ఫిల్టర్లు, స్టిక్కర్లతో మీ ముఖాన్ని మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. మూడు నుంచి ఆరు సెకన్ల  వీడియో క్లిప్స్‌ను కూడా క్రియేట్ చేయవచ్చు.
3.యూకామ్ పర్ఫెక్ట్-సెల్ఫీ కెమెరా (You cam perfect-selfie camera)
ఇది బెస్ట్ ఆండ్రాయిడ్ సెల్పీ కెమెరా.  యాప్ తో ఫోటోలు, వీడియో సెల్ఫీలు తీసుకోవచ్చు. ఈ యాప్ మీ ముఖాన్ని రీషేపింగ్ చేస్తుంది. ముడతలు, మచ్చలను తొలగించే ఫ్రీ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. శరీరాన్ని స్లిమ్ గా కనిపించేలా చేయ‌గ‌ల ఈ యాప్ అమ్మాయిల‌కు ఎక్కువ‌గా ఉపయోగపడుతుంది.
4 . ఫ్రంట్ బ్యాక్( frontback)
ఫ్రంట్ బ్యాక్ అనేది ఒక సెల్ఫీ యాప్ మాత్రమే కాదు.. సోషల్ ఫోటో కమ్యూనిటీ కూడా.  వెనక, ముందు నుంచి ఒకేసారి  ఫోటోలు తీయడం ఈ యాప్ ప్రత్యేకత. ఫ్రంట్ బ్యాక్ నుంచి ఒకేసారి తీసిన ఫోటోల్లో నుంచి ఏదైనా ఒకటి సెలక్ట్ చేసుకోవచ్చు. రెండో ఫోటోలో మరిన్ని డిటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు.  
5. సెల్ఫీ కెమెరా (selfie camera)
ఈ యాప్ ప్రత్యేకించి సెల్ఫీ కోసమే డిజైన్ చేశారు. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఇందులో చాలా ఫిల్టర్లు ఉన్నాయి. రియ‌ల్‌టైమ్ సెల్ఫీ ఫిల్టర్లు, ఫోటో ఎడిటర్, ఇంటర్వెల్ టైమర్, సెల్ఫీ స్టిక్, స్క్వేర్‌ మోడ్స్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఈ యాప్‌లో ఉన్నాయి. 
 

జన రంజకమైన వార్తలు