• తాజా వార్తలు

ఏఆర్‌, వీర్ కోసం గూగుల్ కొత్త బ్లాక్స్ యాప్‌

కొత్త కొత్త సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని యూజ‌ర్ల‌ను థ్రిల్ చేయ‌డంలోఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందుంటుంది. త‌మ టెక్నాల‌జీలోనూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌ను చేయ‌డంలో గూగుల్‌ది అగ్ర‌స్థాన‌మే. ఈ నేప‌థ్యంలో ఏఆర్‌, వీఆర్‌ల‌ను మ‌రింత సుల‌భత‌రం చేయ‌డానికి వాటికి 3డీ మోడ‌లింగ్ హంగులు క‌ల్పించ‌డం కోసం గూగుల్ బ్లాక్స్ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్లాక్స్ యాప్ ప్ర‌త్యేక‌త ఏంటంటే ఎవ‌రైనా 3డీ మోడ‌ల్స్‌ను క్రియేట్ చేయ‌చ్చు. ఈ మోడ‌ల్స్‌ను ఓబీజీ ఫార్మాట్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసి ఏఆర్‌, వీఆర్ కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. 

ఆ బ్రాండ్ల కోసం
గూగుల్ తాజాగా డెవ‌ల‌ప్ చేసిన టెక్నాజ‌లీ హెచ్‌టీసీ వీవ్‌, ఒక్లాస్ రిఫ్ట్ హెడ్‌సెట్ల‌లో వాడ‌నున్నాయి.  సుల‌భ‌మైన వ‌ర్చువ‌ల్ రియాల్టీ కంపేలింగ్‌కు, అగ్‌మెంటెడ్ రియాల్టీ (ఏఆర్‌) ఎక్స్‌పీరియ‌న్స్ కోసం ఈ బ్లాక్స్ యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  దీంతో యూజ‌ర్లు వ‌ర్చువ‌ల్ 3డీ కాన్వాస్ మీద 3డీ ఆబ్జెక్ట్‌ను క్రియేట్ చేయ‌చ్చు.  వ‌ర్చువ‌ల్ రియాల్టీ క్రియేట్ చేయ‌డంలో ఇబ్బందుల‌ను గ‌మ‌నించే తాజాగా ఈ కొత్త యాప్‌ను సృష్టించిన‌ట్లు గూగుల్ గ్రూప్ ప్రొడ‌క్టు మేనేర్ జాస‌న్ టోఫ్ చెప్పారు. పిల్ల‌లు ఆడుకునే బ్లాక్స్ గురించి అంద‌రికి తెలుసు. అలాగే కంప్యూట‌ర్ మీద మ‌న‌కు న‌చ్చిన ఆకృతుల త‌యారీ కోసం ఈ గూగుల్ బ్లాక్స్ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ఏ డిజైన్ అయినా చేసుకోవ‌చ్చు
ఈ కొత్త‌గా వ‌చ్చిన బ్లాక్ యాప్ ద్వారా మ‌నకు ఇష్ట‌మైన డిజైన్ల‌ను చేసుకునే అవ‌కాశం ఉంది. సింపుల్‌గా ఉండే షేప్స్‌, క‌ల‌ర్ పేలెట్స్‌, ఉప‌యోగ‌ప‌డే టూల్స్ ఈ యాప్ సొంతం. ఉదాహ‌ర‌ణ‌క మ‌నం ఒక పుచ్చ‌కాయ ముక్క‌ను వేయాల‌న్నా.. లేక ఫారెస్ట్ సీన్ సృష్టించాల‌న్నా తాజా బ్లాక్ యాప్‌తో చాలా  సుల‌భం. ఈ 3డీ మోడ‌ల్ మీరు సృష్టించిన త‌ర్వాత.. ఆ ఫైల్‌ను ఓబీజే ఫార్మాట్లో సేవ‌ల్ చేయాలి. ఆ త‌ర్వాత ఏఆర్‌, వీఆర్ యాప్స్ ద్వారా ఈ మోడ‌ల్‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం ఉంటుంది. అప్పుడు 3డీ టెక్నాల‌జీపై అవ‌గాహ‌న పెంచుకుంటున్న వారు కూడా బ్లాక్స్ యాప్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడొచ్చు. ఇందులో ఉన్న సానుకూలాంశం ఏమిటంటే 3డీ మోడ‌ల్స్‌ను నాచుర‌ల్‌గా త‌యారు చేసే అవ‌కాశం ఉండ‌డం. ఒక్లాస్ స్టోర్‌లో ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు