• తాజా వార్తలు

మీ సెల్ఫీల‌ను స్టిక్క‌ర్లుగా మార్చే ప్రిస్మా స్టికీ ఏఐ యాప్

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అంద‌రూ సెల్ఫీలు తీసుకోవ‌డానికి ప్ర‌యత్నిస్తారు. కొంత‌మందికి ఈ స‌ర‌దా ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. రోజూ వీలైన‌న్ని సార్లు సెల్ఫీలు తీసుకోవ‌డం వీరికి స‌ర‌దా. అలాంటి వారి కోసం ప్ర‌త్యేకంగా ఫోన్లే వ‌చ్చేశాయి. అయితే మ‌న సెల్ఫీల‌ను మ‌రింత అందంగా మార్చ‌డానికి కొన్ని యాప్‌లు కూడా వ‌చ్చాయి. అయితే సెల్ఫీల‌ను స్టిక్క‌ర్లుగా మార్చే యాప్‌లు ఉన్నాయ‌ని మీకు తెలుసా? అలాంటి కోవ‌కు చెందిన యాపే ప్రిస్మా! 

స్టికీ ఏఐ
ప్రిస్మా యాప్ గురించి అంద‌రికి తెలుసు. మ‌న ఫొటోల‌ను ఏదో క‌ల‌ర్ పెయింటింగ్ వేసిన‌ట్లు చేస్తూ గ‌మ్మ‌త్తుగా త‌యారు చేస్తాయి ఈ యాప్‌లు. స్మార్టుఫోన్లు వాడుతున్న‌వాళ్లు ఈ యాప్‌ను ఇప్ప‌టికే ప‌రీక్షించి ఉంటారు. అయితే అదే ప్రిస్మా యాప్ ఒక కొత్త ఫీచర్‌తో వ‌చ్చేసింది. అదే స్టికీ ఏఐ. దీన్ని ప్ర‌త్యేకించి సెల్ఫీల కోస‌మే డిజైన్ చేశారు. అంటే మీకు ఇమేజ్‌ల‌ను వేరే టూల్ ద్వారా మార్చుకునే బ‌దులు ప్రిస్మాలోనే మ‌నం అన్ని ర‌కాలుగా మార్చ‌కునే వీలుందిప్పుడు. అంటే సెల్ఫీదిగిన వెంట‌నే ప్రిస్మా ద్వారా వాటిని మ‌నం అందంగా త‌యారు చేసి ఆపై స్టిక్క‌ర్లుగా మార్చేయ‌చ్చు. దీనికి  స్టికీ ఏఐ టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఆర్టిఫిష‌ల్ ఇంటిలిజెంట్
అర్టిఫిష‌ల్ ఇంటిలిజెంట్ అల్గ‌రిథ‌మ్ ద్వారా ప్రిస్మా యాప్ మ‌న సెల్ఫీల‌ను ఆక‌ట్టుకునే స్టిక్క‌ర్లుగా మార్చుతుంది. అలా స్టిక్క‌ర్లుగా మార్చిన మ‌న సెల్ఫీల‌ను ఆన్‌లైన్ ద్వారా సోష‌ల్ మీడియాతో షేర్ చేసుకోవ‌చ్చు.  ఈ విధానం చాలా సుల‌భం. అంటే మీకు ఒక సెల్ఫీ క్లిక్ చేసిన త‌ర్వాత లేక అంత‌కుముందు మీ కెమెరాలో ఉన్న ఫొటోనో తీసుకుని ప్రిస్మా యాప్‌లో పెడితే చాలు అదే మిగిలిన ప‌ని చూసుకుంటుంది. స్టిక్కీ ఏఐ ఆ ఫొటోను క్రాప్ చేసి దాన్ని బ్యాక్ గ్రౌండ్ మార్చి అందులో ఉన్న మ‌నుషుల‌ను ఫోక‌స్ అయ్యేలా చేస్తుంది. మంచి సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ క‌ల‌ర్లు ఇది నింపుతుంది. వీటితో మ‌నం కావాలంటే జీఐఎఫ్ కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప్రాసెస్ అయ్యాక మ‌నో కామిక్‌, కార్టున్ లైక్ ఫిల్ట‌ర్ ద్వారా మ‌న ఫొటోల‌ను ర‌క‌ర‌కాల మోడ‌ల్స్‌లో మార్చుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు