• తాజా వార్తలు

తెలిసింది నేర్పడానికి , తెలుసుకోవాలి అనుకున్నది నేర్చుకోవడానికి అద్భుతమైన యాప్ “ స్కిల్ మేట్

ఈ ప్రపంచం లో అన్నీ తెలిసిన వారు ఎవరూ ఉండరు. అలా అని ఏమీ తెలియని వారు కూడా ఉండరు. ప్రతి మనిషి లోనూ ఒక్కో నైపుణ్యం ఉంటుంది. అయితే తెలియని విషయాలను నేర్చుకోవాలనే తపన మరియు మనకు తెలిసిన విషయాన్ని పదిమందికి పంచాలి అనే స్వభావం కొంతమందిలో మాత్రమే ఉంటుంది. ఆ కొంత మందిలో మీరూ ఒకరా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. అర్జున్ ఖేరా అనే వ్యక్తి కూడా మీలాంటి యువకుడే. కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు తనకు తెల్సింది నేర్పడానికి మరియు తెలుసుకోవాలి అనుకున్నది నేర్చుకోవడానికి ఒక యాప్ నే సృష్టించాడు. అ కథేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం
అర్జున్ ఖేరా గుర్గావ్ కి చెందిన యువకుడు. అతను ఒక దశాబ్దం కు పైగా అక్కడ ఉంటున్నప్పటికీ ఒంటరిగానే ఉన్నాడు. మిగతా వాళ్ళతో కలవాలి వారితో ఆడుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అయితే అతని స్నేహితుడు ఒకడు బెంగుళూరు నుండి తన ఊరికి వచ్చి ఫోటో గ్రఫి లో తనకున్న అసహాయతను చెప్పాక కొంచెం ఆలోచించాడు. వారు స్కూల్ రోజుల్లో ఉన్నపుడు అందరూ కలిసి క్రికెట్ ఆడుకునేవారు. అయితే వయసు పెరిగే కొద్దీ అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉండి ఆటను పూర్తిగా మానేశారు. ఇప్పుడు కామన్ ఇంట్రెస్ట్ లు ఉన్న వ్యక్తులను కనుగొనడం కొంచెం ఇబ్బంది గా మారింది. అంటే ఒకే రకమైన నైపుణ్యాలు ఉండే వారు ఒకే చోట దొరకడం కష్టం అయింది. వ్యక్తులు కేవలం స్కిల్స్ గురించి మాట్లాడుకోవడమే గాక ఒకరినుండి ఒకరు నేర్చుకునే విధంగా ఉండేలా ఏదైనా ఒక ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించాడు. ఈ ఐడియా అతని జీవితాన్ని మార్చివేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్కిల్ మేట్ అనే యాప్ రూపకల్పన చేసే దిశగా అడుగులు వేయించింది.
స్కిల్ మేట్ అనేది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను. ఇది దీని యూజర్ లు ఇరుగు పొరుగు గా ఉండే విధంగా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక్కడి యూజర్ లు స్కిల్స్ వేరే వారి నుండి నేర్చుకోవడమే గాక తమ వద్ద ఉన్న స్కిల్స్ ను కావాలి అనుకున్నవారికి నేర్పగలరు. ఉదాహరణకు మీకు తమిళ్ నేర్చుకోవాలని బాగా ఆసక్తి. ఈ యాప్ లో ఉండే ఫ్రెండ్స్ లో ఎవరికైనా తమిళ్ వస్తే వారు నేర్పించడానికి సిద్దంగా ఉంటారు. అలాగే మీరు వంటలు బాగా చేస్తారు అనుకోండి, ఈ యాప్ లోని ఫ్రెండ్స్ లో ఎవరికైనా వంటలు నేర్చుకోవాలి అని కోరికగా ఉంటే మీరు వారికి ఎంచక్కా వంటలు నేర్పించవచ్చు.
ఈ యాప్ ఎలా ఉంటుంది?
ఈ యాప్ లో మొత్తం మూడు ఆప్షన్ లు ఉంటాయి. మొదటిగా ఎవరినా యూజర్ మరొకరికి కొంత ఫీజు తీసుకుని ఏదైనా స్కిల్ నేర్పించవచ్చు, రెండవదిగా దగ్గరలో ఉన్న టీచర్ ని వెతుక్కుని స్కిల్ నేర్చుకోవచ్చు , ఇక చివరదిగా ఒక వ్యక్తి ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి వేరొక వ్యక్తి తో పెయిర్ అప్ అవ్వవచ్చు. ఇందులోని యూజర్ లో ప్రొఫైల్ లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాక ట్రస్ట్ మీటర్ ద్వారా కొత్త యూజర్ లకు రేటింగ్ కూడా ఇవ్వవచ్చు. తద్వారా ఫేక్ ప్రొఫైల్ లను బలహీనపరచవచ్చు.
అసలు ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్న సందేహం లో మనవాడు ఒక సర్వే కూడా చేయించాడు. సుమారు 200 మంది ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఈ సర్వే నిర్వహించాడు. వీరిలో సుమారు 80 శాతం మంది కామన్ హాబీ లు ఉన్న స్నేహితుని వెదకడం కష్టం గా ఉందని చెప్పారు.75 శాతం మంది ఏదైనా కొత్త గా నేర్చుకోవాలనీ అలాగే తమ దగ్గర ఉన్న స్కిల్స్ ను పదిమందికీ పంచాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇంకేముంది ఈ సర్వే ఇచ్చిన స్ఫూర్తితో అర్జున్ తన తండ్రి సహాయం తో ఈ స్కిల్ మేట్ అనే యాప్ ను రూపొందించాడు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ యాప్ ను మీ ఆండ్రాయిడ్ లో ఇన్ స్టాల్ చేసుకుని మీకు తెలిసిన దానిని తెలియని వారికి నేర్పండి. తెలియని దానిని నేర్చుకోవడానికి సంశయించకండి.

జన రంజకమైన వార్తలు