• తాజా వార్తలు
  •  

యాప్స్‌కి కూడా ఓ నెట్‌ఫ్లిక్స్ రానుంది.. రెడీగా ఉండండి..!

మ‌నకు ఒక యాప్ కావాలంటే ఏం చేస్తాం?.. నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటాం. లేక‌పోతే యాపిల్ స్టోర్ నుంచి ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తాం. దాదాపు మ‌నం అన్ని యాప్‌లు ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకుంటాం. కానీ భ‌విష్య‌త్‌లో ఇది కుద‌ర‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే అన్ని యాప్‌లు ఇక‌పై డ‌బ్బులకు కొనాల్సిందే! జోక్ కాదు.. ఇది నిజ‌మే! వెంట‌నే రాక‌పోయినా ఈ మార్పులు నెమ్మ‌ది నెమ్మ‌దిగా చోటు చేసుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.  యాప్‌ల‌ను కూడా ఒక క‌ట్ట క‌ట్టి (బంచ్‌) గా అమ్మే రోజులు వ‌స్తాయి. నో డౌట్‌!

ఇప్ప‌టికే మొద‌లైంది..
పెయిడ్ యాప్ ప్ర‌క్రియ ఎప్ప‌టి నుంచో ఉన్నా.. అవి అర‌కొర యాప్‌ల‌కు ప‌రిమిత‌మైంది. ముఖ్య‌మైన యాప్‌ల‌న్నీ మ‌నం ఉచితంగానే వాడుకుంటాం. కానీ ఇక‌పై అది కుద‌ర‌దు. ఇక యాప్‌ల‌కు పే చేసి వాడుకోవాల్సిందే.  యులెసిస్ లాంటి యాప్‌లు ఇప్ప‌టికే పే యాప్‌లుగా మారిపోయాయి. అంటే ఈ యాప్‌ల‌ను వాడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్ క‌ట్టాలి. లేదా ఒకేసారి కొనుక్కోవాలి. గ‌తంలో కొన్ని యాప్‌ల‌కు స‌బ్ స్క్రిప్ష‌న్ ఆప్ష‌న్ ఉండేది. అయితే పోటీ దృష్ట్యా అన్నీ యాప్‌లు ఫ్రీగానే వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటున్నాయి. కానీ మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో స‌బ్‌స్క్రిప్ష‌న్ ప‌ద్ధ‌తే స‌రైంద‌ని యాప్ త‌యారీదారులు భావిస్తున్నారు. నెల వారీగా, లేదా ఆరు నెల‌లు, సంవ‌త్సరానికి ఒక‌సారి ఫీజు క‌ట్టి వాడుకునేలా కూడా యాప్‌ల‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.  మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌, ఎజిల్ బిట్స్ లాంటి సంస్థ‌ల‌కు సంబంధించిన యాప్ మేక‌ర్స్ కొత్త నిబంధ‌న‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

క‌ట్ట క‌ట్టి అమ్మేస్తారు!
ఒక యాప్‌ను స‌బ్‌స్కైబ్ చేయ‌డం  అది న‌చ్చ‌క‌పోతే మ‌రో యాప్ కొన‌డం ఇవ‌న్నీ ప్ర‌స్తుతం జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ఇలా ప్ర‌తిసారి యాప్‌లకు  ఫీజు చేయాలంటే చాలా క‌ష్టం. ఇందు కోస‌మే ఒక కొత్త ప‌ద్ధ‌తి వ‌చ్చింది. అంటే ఒక‌సారి డిష్ టీవీనో లేదా నెట్‌ఫ్లిక్స్‌లా డ‌బ్బులు క‌డితే అన్ని చానెల్స్‌ను చూసే అవ‌కాశం ఉన్న‌ట్లు.. కొన్ని ఇంపార్టెంట్ యాప్‌ల‌న్నిటిని ఒక బంచ్‌లా స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకునే అవ‌కాశం రానుంది. దీని వల్ల మ‌నకు డ‌బ్బులు ఆదా అవుతాయి.  యాప్ త‌యారీదారుల‌కు యాప్‌లు కూడా వాడ‌కంలోకి వ‌స్తాయి. 

జన రంజకమైన వార్తలు