• తాజా వార్తలు

ఉచితంగా ఐపీఎల్ చూడడానికి బెస్ట్ యాప్స్ ఏవి?

క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి సమయం వచ్చేసింది. ఈ రోజు నుండి వివో ఐపిఎల్ 2018 ప్రారంభo కానుంది. సాయంత్రం అయ్యిందంటే అన్ని కళ్ళు టీవీ సెట్ లకు అతుక్కుపోతాయి. అయితే టీవీ ప్రసారాలతో పాటు కొన్ని యాప్ లు కూడా ఈ ఐపిఎల్ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నాయి. అలాంటి యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.

హాట్ స్టార్

వివో ఐపిఎల్ 2018 కు అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా హాట్ స్టార్ వ్యవహరిస్తుంది. అంటే దీని యూజర్ లు ఈ యాప్ ద్వారా ఐపిఎల్ మ్యాచ్ లను లైవ్ లో చూడవచ్చు. మొదటి పది నిముషాలు ఉచితంగానే చూడవచ్చు. ఆ తర్వాత నుండి హాట్ స్టార్ ఆల్ స్పోర్ట్స్ ప్యాక్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవలసి ఉంటుంది. దీని విలువ రూ 299/- లు ఉంటుంది. దీనితో పాటుగా వీక్షకులు తమ క్రికెట్ పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడానికి వాచ్ ఎన్ ప్లే అనే ఒక స్కిల్ బేస్డ్ గేమ్ కూడా ఇందులో ఉంటుంది. వర్చ్యువల్ రియాలిటీ ని కూడా అందుబాటులోనికి తెచ్చే ప్రయత్నాలలో హాట్ స్టార్ ఉన్నది.

ఎయిర్ టెల్ టీవీ

మీరు ఎయిర్ టెల్ కస్టమర్ అయితే వివో ఐపిఎల్ మ్యాచ్ లు అన్నింటినీ హాట్ స్టార్ ద్వారా ఎయిర్ టెల్ టీవీ లో ఇవే స్ట్రీమ్ చేయవచ్చు. ఎయిర్ టెల్ తన తాజా అప్ డేట్ లో చాలా చక్కటి నాణ్యంగా క్రికెట్ ను వీక్షించేందుకు అవసరమైన డిజైన్ ను కలిగి ఉన్నది. యూజర్ లు తమ ఫేవరేట్ టీం లను సెలెక్ట్ చేసుకుని ఫాలో అయ్యే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.ఇంటరాక్టివ్ గేమ్స్ తో పాటు స్పెషల్ స్కోర్ కార్డు నోటిఫికేషన్ కూడా ఇందులో ఉంటుంది.

ఐపిఎల్ 2018

పల్స్ ఇన్నోవేషన్స్ రూపొందించిన  ఈ యాప్ ఐపిఎల్ యొక్క అధికారిక యాప్. ఇది ఐఒఎస్ మరియు ఆండ్రాయిడ్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. లైవ్ యాక్షన్స్ ను మొబైల్ లో చూడడానికి ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. బంతిబంతికీ లైవ్ స్క్రోర్ కామెంటరీ, వీడియో హై లెట్స్, ఫిక్చర్స్, రిజల్ట్స్, మ్యాచ్ రిపోర్ట్స్ ఇలా అనేకరకాలు ఇందులో ఉంటాయి. ఈ యాప్ ద్వారా టికెట్ లు కూడా కొనవచ్చు.

యాహూ  క్రికెట్

ఇది కేవలం ఇండియన్ వీక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రియల్ టైం అప్ డేట్స్ మరియు రియల్ టైం కాంటెంట్ ని ఇది కలిగి ఉంటుంది. సూపర్ ఫాస్ట్ బాల్ బై బాల్ కామెంటరీ, స్కోర్ అప్ డేట్స్ ఇలా అనేక విశేషాలు ఉంటాయి. ఇన్ఫో గ్రాఫిక్స్, రియల్ టైం పోల్స్, ట్వీట్స్ కూడా ఇందులో ఉంటాయి.

గూగుల్ అసిస్టంట్

గూగుల్ అసిస్టంట్ యాప్ ద్వారా ఐపిఎల్ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్ లో చూడవచ్చు. లైవ్ స్కోర్ అప్ డేట్స్, మ్యాచ్ షెడ్యూల్స్, టీం లు మరియు మ్యాచ్ ల గురించిన సమాచారం మొదలైనవి కూడా ఇందులో ఉంటాయి. ఇది ఐఒఎస్ మరియు ఆండ్రాయిడ్ రెండింటిలో నూ అందుబాటులో ఉంటుంది.

జన రంజకమైన వార్తలు