• తాజా వార్తలు

ఎంఆధార్ యాప్‌: ప‌్ర‌త్యేక‌త‌లు, లోపాలు

ఆధార్‌.. ఇప్పుడు ఏ ప‌ని చేయాల‌న్నా మ‌న‌కు ఎదుర‌వుతున్న ప్ర‌శ్న ఇదే! మీకు ఆధార్ ఉందా! వెంట‌నే ఆధార్‌ను లింక్ చేయండి.. లేక‌పోతే వెంట‌నే న‌మోదు చేయించుకోండి... ఇవే మాట‌లు మ‌నం రోజూ వింటున్నాం. ఆధార్ ద్వారానే ఏకీకృత పాల‌న సాధ్య‌మ‌ని ప్ర‌భుత్వం న‌మ్ముతోంది. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్  క‌లిగి ఉండాల‌ని సూచిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే యూఐడీఏఐ మై ఆధార్ అప్లికేష‌న్‌ను లాంఛ్ చేసింది. మ‌రి ఈ కొత్త ఆధార్ యాప్‌లో ప్ర‌త్యేక‌త‌లేంటి... దీనిలో ఉన్న లోపాలెంటో చూద్దామా..

బ‌యోమెట్రిక్ అథంటికేష‌న్‌
ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్‌ఫోన్ల కోసం యూఐడీఏఐ ఈ ఎం ఆధార్ అప్లికేష‌న్‌ను విడుదుల చేసింది. దీనిలో మీ పేరు, పుట్టిన తేదీ,  జెండ‌ర్‌, అడ్రెస్ త‌దిత‌ర  వివ‌రాలు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. దీని వ‌ల్ల మీ ఆధార్ మీ పాకెట్లోనే ఉంటుంది. మీరు ఎక్క‌డికి కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఎం ఆధార్‌ను ఓపెన్ చేసి చూపిస్తే స‌రిపోతుంది. ఎం ఆధార్‌ను అప‌రిచితులు ఓపెన్ చేయ‌కుండా బ‌యోమెట్రిక్ అథంటికేష‌న్ ఏర్పాటు చేశారు. మీరు త‌ప్ప ఆ యాప్‌ను ఎవ‌రూ ఓపెన్ చేయ‌లేరు. ఒక‌వేళ మీరు కాకుండా వేరే వాళ్లు ఓపెన్ చేయాల‌నుకుంటే మొత్తం లాకింగ్
 సిస్ట‌మ్ అంతా డిజేబుల్ చేయాల్సి వ‌స్తుంది.  మీ స్మార్టుఫోన్ల వాడుతున్న ఫోన్ నంబ‌ర్‌.. ఆధార్ కార్డు కోసం ఇచ్చిన నంబ‌ర్ ఒక‌టే అయి ఉండాలి.

పాస్‌వ‌ర్డ్ క్రియేష‌న్
ఎం ఆధార్ అప్లికేష‌న్ ఓపెన్ చేసిన వెంట‌నే పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 8 నుంచి 16 క్యారెక్ట‌ర్ల పొడ‌వుండే పాస్‌వ‌ర్డ్‌ను మీరు సృష్టించుకోవాలి. ఈ పాస్‌వ‌ర్డ్‌లో అంకెల‌తో పాటు ఒక స్పెష‌ల్ కారెక్ట‌ర్‌, ఒక కాపిట‌ల్ లెట‌ర్ ఉండి తీరాలి. మీ ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్‌కు ఎలాంటి భంగం వాటిల్ల కుండా యూఐడీఏఐ ఎం ఆధార్‌కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేసింది. అథంటికేష‌న్ లేకుండా ఎవ‌రూ ఈ యాప్‌ను వాడ‌లేరు. ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌తో పాటు టూ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్‌ను కూడా మ‌నం దీనికి ఏర్పాటు చేసుకోవ‌చ్చు. పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసిన త‌ర్వాత ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. దీన్ని మ్యాన్యువ‌ల్‌గా కానీ లేక కార్డుని క్యూర్ కోడ్‌తో స్కాన్ చేసి కానీ ఎంట‌ర్ చేయ‌చ్చు. అప్పుడు యాప్ మీ ఫోన్ నంబ‌ర్‌కు ఓటీపీని పంపిస్తుంది. ఓటీపీ ఎంట‌ర్ చేయ‌గానే మీ ఎం ఆధార్ క్రియేట్ అవుతుంది.  
 

జన రంజకమైన వార్తలు