అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ''దేర్ ఈజ్ నో వే(జీరో) దట్ మెయిల్-ఇన్ బ్యాలట్స్ విల్ బి ఎనీథింగ్ లెస్ దేన్ సబ్‌స్టాన్షియల్లీ ఫ్రాడ్యులెంట్'' అంటూ ట్రంప్ ఇటీవల ట్వీట్ చేశారు. దీనికి ట్విటర్ నిజాలు తెలుసుకోవాలంటూ ఫ్యాక్ట్ చెక్ లేబుల్‌ను తగిలించింది. దీంతో ట్రంప్ సర్రున లేచారు. ట్విటర్ భావప్రకటనా స్వేచ్ఛను హరించేస్తోందంటూ రీట్వీట్ చేశారు.
మెయిల్-ఇన్ బ్యాలెట్స్ అంటే ఏంటి?
మెయిల్-ఇన్ బ్యాలెట్ అంటే పోస్టల్ ఓట్లు. వీటి ద్వారా ప్రజలు తమ ఓటును మెయిల్-ఇన్ బ్యాలట్ ద్వారా వేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేయడం కష్టమని, మెయిల్ ఇన్ బ్యాలెట్ ఇవ్వాలని ఇటీవల ఓ సర్వేలో 66%మంది అమెరికన్లు చెప్పారు.
ట్రంప్ ఎందుకు ఫైర్ అయ్యారు?
అయితే ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అందుకే దీని వల్ల మోసం జరిగే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ట్విటర్ బ్లూ ట్యాగ్ తగిలించింది. అంటే ఈ ట్వీట్‌లో ఉన్న సమాచారం అనుమానాస్పదంగా ఉందని, దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని ట్విటర్ ఉద్దేశం. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. తన ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ లోగో తగిలించడం ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలదూర్చాలని ట్విటర్ భావిస్తోందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
ట్విటర్ ఏమంటోంది?
కరోనా విషయంలో అవాస్తవాలు ట్విటర్ ద్వారా ప్రచారం కాకూడదన్న ఉద్దేశంతో అనుమానాస్పదంగా ఉన్న పోస్టులకు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి అనే లోగోను తగిలించింది. ఇది కరోనా విషయంలో బాగా పని చేసింది. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఇలా ట్విటర్ ఫాలోయర్లను తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతుందని ట్విటర్ భావిస్తోంది. అందుకే ట్రంప్ ట్వీట్‌ను ఓకే చేస్తూనే ఫ్యాక్ట్ చెక్ చేసుకోమని లోగో పెట్టింది. ఇదే ట్రంప్‌కు కోపం తెప్పించింది. రాబోయే రోజుల్లో ట్రంప్ వర్సెస్ ట్విటర్ వార్ ఎక్కడిదాకా వెళుతుందో మరి.
Twitter fact checking logo Trump vs twitter à°Ÿà±à°°à°‚పౠవరà±à°¸à±†à°¸à± à°Ÿà±à°µà°¿à°Ÿâ€Œà°°à±