ఆంధ్రప్రదేశ్ లో షియోమీ ట్రక్కులో నుంచి కోటి రూపాయలు విలువగల ఫోన్లు అపహరణ!

ఆంధ్రప్రదేశ్ లో భారీ దొంగతనం జరిగింది. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా స్మార్ట్ ఫోన్లను తరలిస్తున్న ట్రక్కు చోరీకి గురయ్యింది. కంటెయినర్ నిండా స్మార్ట్ ఫోన్ల లోడ్ తో వెళ్తున్న ట్రక్కును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు జిల్లా దగదర్తి సమీపంలో లారీని అడ్డుకున్న కొందరు దుండగులు..డైవర్ పై దాడి చేసి ట్రక్కును ఎత్తుకెళ్లారు. ట్రక్కులో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు కోటిరూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. 

అయితే ట్రక్కును దుండగులు తెలివిగా దొంగిలించారు. ట్రక్కును గుర్తుపట్టే ఛాన్స్ ఉందని ముందే గుర్తించిన దొంగలు...ఫోన్లన్నింటినీ మరో వాహనంలోకి షిఫ్ట్ చేశారు. గౌరారం గ్రామం వద్ద ఖాళీ ట్రక్కును వదిలేశారు. అక్కడి నుంచి దొంగలు ఎటువైపు వెళ్లారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల పోలీసు స్టేషన్లనూ అలర్ట్ చేశారు. ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దింపారు. కోటి రూపాయలు విలువ చేసే ఫోన్లు కావడంతో ...పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ట్రక్కులో ఉన్న స్మార్ట్ ఫోన్ల ధర 6వేల నుంచి 14వేల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. 
 

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు స్మార్ట్ ఫోన్లు దొంగతనం andhra pradesh nellore smart phones theft