ఏపీలో ఓట‌ర్ లిస్ట్‌లో అర్జెంట్‌గా రిజిస్ట‌ర్ కావ‌డం ఎలా?

ఇప్పుడు న‌డుస్తోంది ఎన్నిక‌ల సీజ‌న్‌. నోటిఫికేష‌న్ వెలువ‌డిన ద‌గ్గ‌ర నుంచి రాజ‌కీయ పార్టీల‌తో పాటు జ‌నాల్లోనూ హ‌డావుడి మొద‌లైంది. ముఖ్యంగా ఇంకా ఓటు న‌మోదు చేసుకోని వాళ్లు ఓటు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం కోసం చాలా ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ర‌క‌ర‌కాల మార్గాల ద్వారా ఓటరుగా న‌మోదు కావ‌డానికి  ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ముఖ్యంగా అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రిగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే ఓట‌ర్ల న‌మోదు కార్య‌క్ర‌మం చాలా వేగంగా జ‌రుగుతోంది. మ‌రి ఇప్ప‌టికీ ఓటు ఎలా న‌మోదు చేసుకోవాలో తెలియ‌ని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎక్క‌డికీ వెళ్ల‌కుండా కూడా ఓట‌ర్‌గా మారే అవ‌కాశం ఆన్‌లైన్ మ‌న‌కు క‌ల్పిస్తుంది. మ‌రి మనం పేరు ఓట‌ర్‌గా ఎలా ఎన్‌రోల్ చేసుకోవాలో చూద్దాం...

ఓట‌ర్ల‌ను న‌మోదు చేసుకోవ‌డానికి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం త‌న అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లో ఓట‌ర్ల‌కు ఎన్నో మార్గ‌నిర్దేశ‌కాలు చేస్తోంది. ఓటు న‌మోదు చేసుకోవాలంటే ఏ ఫామ్ ఫిల్ చేయాలి. ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఎవ‌రిని సంప్ర‌దించాలి. హెల్ప్‌లైన్ లాంటి వివ‌రాల‌ను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ త‌న సైట్లో పెట్టింది. అంతేకాదు ఏ ఓట‌ర్ అయినా నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓట్ వేయాలి త‌ప్ప‌.. ఆన్‌లైన్‌లో ఓటు కాస్ట్ చేయ‌డం అనే ఆప్ష‌న్ ఉండ‌ద‌ని లేటెస్ట్‌గా ప్ర‌క‌టించింది. కొత్త‌గా ఓట‌ర్‌గా న‌మోదు చేసుకునేవాళ్లు ఫామ్ 6ఏను ఆన్‌లైన్‌లో ఫిల్ చేయాలి. ఇందుకు ఎన్‌వీఎస్‌పీ.ఇన్ లేదా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మొబైల్ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఏం చేయాలంటే..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే కాక కేర‌ళ‌, త‌మిళ‌నాడులో ఓట‌ర్లుగా న‌మోదు కావ‌డం కోసం ఈ క్రింది ప్ర‌క్రియ చేయాల్సి ఉంటుంది.
1.జాతీయ ఓట‌ర్స్ స‌ర్వీస్ పోర్ట‌ల్‌కు వెళ్లాలి.  లేక‌పోతే గూగుల్‌లో ఎన్‌వీఎస్‌పీ.ఇన్ అని టైప్ చేసినా స‌రిపోతుంది.

2,.ఈ ఎల‌క్ష‌న్ పోర్ట‌ల్ సైట్‌లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత ఫామ్ 6ని ఓపెన్ చేయాలి. ఆ ఫామ్‌లో మీరు ఏ స్టేట్‌కు సంబంధించిన వారో ఫిల్ చేయాలి. అంతేకాక మీ అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌ను ఎంచుకోవాలి.

3. ఆ త‌ర్వాత అప్లికెంట్ సెక్ష‌న్‌లో మీ పేరు ఇంగ్లిష్‌లో రాయాలి. ఇంటిపేరు కూడా ఎంట‌ర్ చేయాలి. మీ జెండ‌ర్‌ను ఎంపిక చేసుకోవాలి. పుట్టిన తేదీ వివ‌రాలు ఇవ్వాలి. ఆ త‌ర్వాత మీరు పుట్టిన స్థ‌లం కూడా మెన్ష‌న్ చేయాలి.

4. మీ జిల్లా, స్టేట్‌, పిన్‌కోడ్‌, పోస్ట్ ఆఫీస్‌, గ్రామం, ప్రాంతం, ఇంటి నంబ‌ర్ అన్ని వివ‌రాలు ఫిల్ చేయాలి. ఆ త‌ర్వాత ఫొటో (క‌నీసం 2 ఎంబీ సైజు)ను జేపీజీ, పీఎన్‌జీ, బీఎంపీ, .జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. అలాగే మీ వ‌య‌సును నిర్ధారించే ఐడీ ఫ్రూఫ్, అడ్రెస్‌ను తెలిపే అడ్రెస్ ఫ్రూఫ్ కాపీల‌ను కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

5. మీ డేట్ ఆఫ్ బ‌ర్త్‌, అడ్రెస్ కరెక్ట్‌గా ఉండాలి. వివ‌రాల‌న్నిక‌రెక్ట్‌గా ఉన్నాయో లేదో స‌రి చూసుకుని స‌బ్‌మిట్ బ‌ట‌న్ నొక్కాలి.  అంతే ఆన్‌లైన్‌లో మీ ఓట‌రు న‌మోదు పూర్త‌యిన‌ట్లే. కొన్ని రోజుల్లోనే మీకు వెరిఫికేష‌న్ జ‌రిగి ఓట‌ర్ కార్డు వ‌స్తుంది.

Enroll Register Name Voters List AP Kerala Tamil Nadu