గూగుల్‌లో కొత్త ఫీచ‌ర్‌...మీ హిస్ట‌రీ మొత్తం ఆటో డిలెట్

గూగుల్ త‌న కొత్త యూజ‌ర్ల‌కు ఓ మంచి ఫీచ‌ర్‌ను లాంచ్ చేసింది. ఇకపై వారి లోకేషన్‌ హిస్టరీ, యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్‌ కాబోతుంద‌ని ప్ర‌క‌టించింది.  గూగుల్‌ సెట్టింగ్స్‌లో ఈ మేర‌కు మార్పులు చేసినట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తన  ‌బ్లాగ్‌లో ప్ర‌క‌టించారు.  మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, బాధ్య‌తాయుతంగా ఉండటం, నియంత్రణలో ఉంచడం అనే మూడు విష‌యాల‌ను మేం దృష్టిలో పెట్టుకుంటామ‌ని పిచాయ్ చెప్పారు.  

18 నెల‌ల త‌ర్వాత ఆటో డిలెట్‌
ఇక నుంచి గూగుల్‌ యూజర్‌ హిస్టరీ 18 నెలల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్‌  అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ డేటాను మాన్యువ‌ల్‌గా డిలీట్   చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా డిలీట్‌ కానుంది. అయితే ఇది గూగుల్‌ కొత్త అకౌంట్ల‌కు మాత్ర‌మే. 

పాత యూజ‌ర్ల‌కూ ఆప్ష‌న్ 
అయితే పాత యూజ‌ర్ల‌కు కూడా ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి తెచ్చింది. వారికి డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ- మెయిల్‌ ద్వారా  సమాచారాన్ని అందిస్తామని పిచాయ్ తెలిపారు. వారు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్‌ను  బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలల కొకసారి ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవుతుందని గూగుల్‌ వర్గాలు తెలిపాయి. దీంతో వినియోగదారుల భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే  ఈ ఆటోమెటిక్‌ డిలిట్‌ ఆప్షన్‌ జీ మెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌కు వర్తించదు. గూగుల్ యాప్ లేదా వెబ్‌లో హిస్ట‌రీ మాత్ర‌మే ఆటోమేటిగ్గా డిలెట్ అవుతుంది.  

గూగుల్‌ గూగుల్ కొత్త ఫీచ‌ర్లు గూగుల్ హిస్ట‌రీ ఆటో డిలెట్‌ Google Google new Features Google history auto delete