జియో గిగాఫైబర్ ప్రివ్యూ ప్లాన్లు, ఆఫర్స్, అప్‌డేట్ అయినవి మీకోసం

దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ బ్యాండ్ రంగాన్ని కూడా అదే ఊపు ఊపుతోంది. జియో గిగా ఫైబర్ పేరుతో దేశంలో మరో సంచలనం రేపేందుకు రెడీ అయింది. బ్రాడ్ బ్యాండ్ రంగంలో తనదైన ముద్ర వేయాలనే వ్యూహాంలో రోజుకో అప్ డేట్ ను అందిస్తో వస్తోంది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో అప్ డేట్ ఇచ్చిన ప్లాన్లను ఓ సారి పరిశీలిద్దాం.

ప్రస్తుత్తం జియో గిగా ఫఐబర్ సర్వీసుల కోసం దేశ వ్యాప్తంగా రిక్వెస్టులు తీసుకుంటున్నామని, వాటిని రిసీవ్ చేసుకుని వీలైంత త్వరలో వారికి సేవలను అందిస్తామని కంపెనీ తెలిపింది.దేశవ్యాప్తంగా మొత్తం 1400 నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తున్నట్లుగా జియో  తెలిపింది.జియో గిగాఫైబర్ కావాల్సిన వారు డిపాజిట్ కింద రూ.4500 చెల్లించాలి. అయితే ఇది తిరిగి రీఫండ్ చేస్తారు. ఆఫర్ అయిపోయిన తరువాత వద్దనుకున్నవారు దీనిని డిస్ కంటిన్యూ చేసుకోవచ్చు. నెలకి రూ.500తో జియోగిగాఫైబర్ ప్లాన్ మొదలు కానుంది. 

దేశ వ్యాప్తంగా జియో గిగాఫైబర్ సేవలను అందించేందుకు కావాల్సిన నెట్ వర్క్ ని సిద్ధం చేసుకుంది. దీని కోసం  DEN Networks, Hathway Cable & Datacom లాంటి సంస్థలతో టైఅప్ అయింది.జియో తెలిపిన వివరాల ప్రకారం జియో గిగాఫైబర్ తొలిసారిగా బెంగుళూరు, చెన్నై, పూణె, లక్నో, కాన్పూర్,రాయ్ పూర్, నాగపూర్, ఇండోర్, థానే, భోపాల్, ఘజియాబాద్, లుథియానా, కోయంబత్తూర్, ఆగ్రా, మధురై, నాసిక్, ఫరిదాబాద్, మీరట్, రాజ్ కోట్, శ్రీనగర్, అమృత్‌సర్, పాట్నా, అలహాబాద్, రాంచి, జోధ్పూర్, కోట, గౌహతి, చండీఘర్,సోలాపూర్లలో అందుబాటులోకి రానుంది.

జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ల కోసం గతేడాది ఆగస్టు 15 న కంపెనీ తన వెబ్ సైట్లో ఆహ్వానాలను అపర్ చేసింది. కంపెనీ అఫిషియల్ సైటు gigafiber.jio.com/registration.నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.జియో గిగా ఫైబర్ వినియోగదారుల కోం బండిల్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూటర్ కూడా అందించనుంది.

దీంతో పాటు బయ్యర్లు స్మార్ట్ రిమోట్ ని కూడా ఉచితంగా పొందవచ్చు. వాయిస్ కమాండ్ ఆధారంగా రిమోట్ పనిచేయనుంది.అనేక భాషలను ఇది సపోర్ట్ చేయనుంది.జియో గిగాఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కింద ఇప్పటికే ప్రధాన నగరాల్లో 3 నెలల ట్రయల్స్ ని నిర్వహిస్తోంది. నెలకి 100 జిబి చొప్పున మూడు నెలలకు 300జిబిని అందిస్తోంది.4K videos and play VR gamesని 1జిబిపిఎస్ స్పీడులో అందుకోవచ్చు.
 

న్యూస్ టెక్నాలజీ మొబైల్స్ రిలయన్స్ గిగా ఫైబర్