జీమెయిల్‌ సెట్టింగ్స్ చెక్ చేశారా, కొత్తగా డార్క్ మోడ్ ఫీచర్ వచ్చింది 

స్మార్ట్‌ఫోన్ వాడే యూజర్లకు గూగుల్ శుభవార్లను అందించింది. లెటేస్ట్ జీమెయిల్ వెర్షన్ 2019లో కొత్తగా డార్క్ మోడ్ ఫీచర్ ని ప్రవేశపెట్టింది.జీమెయిల్ యాప్ లో లేటెస్ట్ వెర్షన్ 2019.06.09లో యూజర్లు ఈ కొత్త ఫీచర్ ని టెస్ట్ చేయవచ్చు. కాగా ఇప్పటికే ఈ ఫీచర్  పాపులర్ యాప్స్ ఫేస్ బుక్ మెసేంజర్, గూగుల్ క్రోమ్ లో అందుబాటులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వాట్సప్‌లో కూడా డార్క్ మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడంపై కంపెనీ కసరత్తు చేస్తోంది. 

ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. డార్క్ మోడ్ ఫీచర్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది. ఆండ్రాయిడ్ జీమెయిల్ యాప్ లో కనిపించే డార్క్ మోడ్ ఆప్షన్.. సెట్టింగ్స్ లో న్యూ గ్రే ఇంటర్ ఫేస్ కనిపించింది. ఈ కొత్త మోడ్ అప్పుడప్పుడు మాత్రమే యూజర్లు చూసేందుకు వీలుంది. ఇందులో మెయిన్ ఇన్ బాక్స్ పేజీ, సైడ్ మెనూలో వైట్ కలర్ అలానే కొనసాగనుంది. 

మళ్లీ ప్రీవియస్ ఆప్షన్ కు స్విచ్ అవడానికి కుదరదు. డార్క్ మోడ్ ఫీచర్ ను కేవలం సెట్టింగ్స్ మెనూలో మాత్రమే చూడవచ్చు. అయితే ఇది మెయిన్ విండోలా, సైడ్ బార్ లో కనిపించదు. యాక్టివ్ యాప్ సైడ్.. డార్క్ మోడ్ ఫీచర్ ఇన్ యాక్టివేట్ మోడ్ లో ఉంటుంది. అధికారికంగా లాంచ్ అయ్యేవరకు డార్క్ మోడ్ ఫీచర్ ఇదే మోడ్ లో కనిపించనుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కొంతమంది యూజర్లకు ఈ కొత్త వెర్షన్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది.

జీమెయిల్ v2019.06.09 APK మిర్రర్ నుంచి డార్క్ మోడ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. జీమెయిల్, జీ సూట్ యూజర్ల కోసం జూలై 2 నుంచి డైనమిక్ ఈమెయిల్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్ ప్రకటించింది. 

డైనమిక్ ఈమెయిల్స్ ఫీచర్ ద్వారా తమ ఈమెయిల్స్ కంటెంట్ తో ఇంట్రాక్టీవ్ అయ్యేందుకు కంపెనీలను అనుమతిస్తోంది. వేర్వేరు ఈమెయిల్ అలర్ట్స్ బదులుగా తమ కామెంట్స్ పోస్టులను డ్యాకుమెంట్లపై నేరుగా చూసేందుకు గూగుల్ డాక్స్ కూడా యూజర్లును అనుమతిస్తోంది.

న్యూస్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ జీమెయిల్ యాప్ జీమెయిల్ డార్క్ మోడ్ డార్క్ మోడ్ ఆప్షన్ ఈమెయిల్ అలర్ట్స్