బ్రౌజింగ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పొరపాట్లు ఇవే

సరైన ప్రికాషన్స్ లేకండా చేసే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటమనేది పలు సమస్యలకు దారి తీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెట్ బ్రౌజింగ్ విషయంలో కనీస అవగాహన తప్సనిసరి. వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో చాలామంది అనేక రకాల తప్పులను చేస్తుంటారు. అలాంటి సమయంలో పోన్ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. మాల్ వేర్ లు అటాక్ చేసే స్రమాదం ఉంది. ఈ శీర్షికలో భాగంగా బ్రౌజింగ్ చేసే సమయంలో మీకు కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ సారి చెక్ చేయండి.

బ్రౌజర్‌ను అప్‌గ్రేడ్ చేయకుండా నెట్ సర్ఫింగ్‌కు ఉపక్రమించకండి. బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం వల్ల ఎర్రర్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుడా బ్రౌజంగ్ మరింత వేగవంతంగా ఉంటుంది.

ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూజర్‌ ఎంచుకున్న ప్రిఫరెన్సులను గుర్తుంచుకోవడానికి కుకీస్ ఉపయోగపడతాయి. కాబట్టి కుకీలను అవసరం మేరకే అనుమతించండి. మీరు కుకీలను అనుమతించిన పక్షంలో కొన్ని వెబ్‌సైట్‌లు మీ బ్రౌజర్‌లో ఓపెన్ కావు.

బ్రౌజ్ చేస్తున్న సమయంలో మీరు ఉపయోగించే అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు ఒకటే పాస్‌వర్డ్‌ను సెట్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. పొరపాటున మీ సింగిల్ పాస్‌వర్డ్ ఇతర వ్యక్తులకు తెలిస్తే తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, ఒక్క అకౌంట్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్‌ను చేసుకోండి. 

మీ బ్రౌజర్‌కు ఎక్కువ సంఖ్యంలో ప్లగిన్స్ లేదా ఎక్స్‌టెన్సన్‌లను జోడించటం వల్ల బ్రౌజర్ వేగం మందగిస్తుంది. కాబట్టి అనవసరమైన ప్లగిన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

ఇంటర్నెట్ బ్రౌజింగ్ నెట్ బ్రౌజింగ్ వెబ్ బ్రౌజింగ్ ఆన్‌లైన్ అకౌంట్‌ జీమెయిల్